నిప్పులు చిమ్ముతూ నింగికి
పీఎస్‌ఎల్‌వీ సీ-27 విజయవంతం
శ్రీహరికోట,మార్చి28(జనంసాక్షి): భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని దాటం. మరో కీర్తి కిరీటాన్ని షార్ అద్దుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి27(పీఎస్‌ఎల్‌వీ) నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’ నుంచి శనివారం సాయంత్రం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాహకనౌక ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అంతకుముందు గురువారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ 59.30 గంటలపాటు కొనసాగింది. షార్ తొలి ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దీంతో గురువారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ కి తెరపడింది. అంతకుముందు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శుక్రవారం, పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను పరిశీలించారు. శాస్త్రవేత్తలతో సవిూక్షల అనంతరం 1,425 కిలోల బరువున్న భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ)ను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చుకునేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుట్టింది. మొత్తం ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించాలనే వ్యూహంలో భాగంగా ఇది నాలుగోది. ఉపగ్రహ ప్రయోగం విజయం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం సాయంత్రం రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడానికి 19 నిమిషాల 25 సెకెన్ల సమయం పట్టింది. పీఎస్‌ఎల్‌వీసీ-27 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ శాస్త్రవేత్తలను అభినందించారు. సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఇప్పటి వరకు మూడు శాటిలైట్లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి నాలుగో శాటిలైట్. మరో మూడు శాటిలైట్లను నింగిలోకి పంపితే సొంతనావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సముద్రంలో నౌకలు, ఆకాశంలో విమానాల గమనం విపత్తుల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. పీఎస్‌ఎల్వీ సీ 27 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో ఆనందోత్సహాలు వెల్లివిరిసాయి. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ 27 రాకెట్ నిర్ణీత సమయంలో కక్ష్యలోకి చేరుకుంది. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్వీ సీ 27 ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికి అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయవంతంతో మన సత్తా చాటామన్నారు. ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. కాగా, ఇస్రో ఛైర్మన్‌గా కిరణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి అంతరిక్ష ప్రయోగం.