నిరుపేద కుటుంబాలకు పెద్దదిక్కు సుల్తానా,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవత్వం.
దౌల్తాబాద్ ఆగష్టు 12, జనం సాక్షి.
ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి తోచిన సహాయం చేసి నేనున్నానంటూ గుండె ధైర్యం కలిగించడం నిజమైన మానవత్వం సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తానా ఉమర్ శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన పూసల నరేష్ కుటుంబాన్ని పరామర్శించి బియ్యం,నిత్యవసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంతం ఊరు తేడా లేకుండా సాటి మనుషులు ఎక్కడ కష్టాలలో ఉంటే అక్కడికి వెళ్లి తన వంతు సహాయం అందజేసి వారికి ధైర్యం కలిగించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గురువయ్య,శేఖర్, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.