నిర్దోషిత్వం నిరూపించుకోమంటే ఉలుకెందుకు?

2

జగదీశ్వర్‌రెడ్డికి పొన్నం హితవు

హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి): మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నిర్దోషిత్వం నిరూపించుకోమంటే ఉలుకెందుకని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇంటెలిజెన్స్‌ నివేదిక ద్వారా సీఎం వాస్తవాలు తెలుసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అవినీతి నేత అయిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఎలా టిక్కెట్‌ ఇచ్చారని అన్నారు. పల్లా ద్వారా కాలేజీల నుంచి మంత్‌ంరి జగదీశ్వర్‌ రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని అన్నారు. వీటిని రుజువు చేస్తానని అన్నారు.  గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… ఆరోపణలపై మంత్రి జగదీశ్‌రెడ్డి తన నిర్దోషిత్వం నిరూపించుకోవాలన్నారు. అవినీతి నిరూపితమైతే పదవి నుంచి జగదీశ్‌రెడ్డిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాజయ్య బర్తరఫ్‌పై సీఎం ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఏ అర్హత ఉందని ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చారని పొన్నం ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చెప్పినవి ఏవీ ఆచరణలో చూపట్లేదన్నారు.