నిర్భయ నిందితుడి ఇంటర్వ్యూపై మండిపడ్డ మహిళాసభ్యులు

3

ప్రసారం కాకుండా అడ్డుకుంటాం : రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి): నిర్భయ డాక్యుమెంటరీ ఉదంతంపై బుధవారం  రాజ్యసభ దద్దరిల్లింది. నిర్భయపై అత్యాచారానికి ఒడిగట్టి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ నేరగాడిని ఎలా ఇంటర్వ్యూకు అనుమతించారనిమహిళా ఎంపీలంతా మూకుమ్మడిగా వెల్‌లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఇది మహిళలను అగౌరవ పరచి, అవమానించేదిగా ఉందన్నారు.  రాజ్యసభలోని మహిళా సభ్యులంతా ధ్వజమెత్తారు. ఎంపీ, బాలీవుడ్‌ నటిజయాబచ్చన్‌  మాట్లాడుతూ, అసలు దోషికి మరణ శిక్ష ఎందుకు విధించలేదో చెప్పాలన్నారు. మొసలి కన్నీళ్లు తమకు అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చూస్తూ  సభను వాకౌట్‌ చేశారు.   నిర్మలా సీతారామన్‌,  మాయావతి, అంబికాసోనీ తదితరులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. సత్వరమే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సభ్యుల ఆందోళనతో సభ కాసేపు వాయిదా పడింది.  ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై చర్చ చేపట్టిన సభ.. నిర్భయ కేసులో దోషి ముఖేష్‌ కుమార్‌ను ఇంటర్వ్యూ చేయటాన్ని తీవ్రంగా ఖండించింది.దోషిగా ఉన్న అతడితో ఇంటర్వ్యూకు అనుమతిచ్చిన జైలు అధికారులపై చర్యలు  తీసుకోవాలని  ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఘటనపై  ఏం చర్యలు తీసుకున్నారో  తెలపాలని ఛైర్మన్‌ హవిూద్‌ అన్సారీ సూచించారు. మరోవైపు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ కూడా ఈ ఇంటర్వ్యునూ ఖండించారు.  బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సభకు తెలిపారు. ఈ సంఘటనపై కేంద్ర ¬ంమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ వివరణ ఇస్తూ … ఇది చాలా  తీవ్రమైన విషయమని, వ్యక్తిగతంగా కూడా తనను  ఈ సంఘటన తనను ఎంతో బాధించిందన్నారు. డాక్యుమెంటరీ తీసిన వ్యక్తికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. మరోవైపు ముకేష్‌ ఇంటర్వ్యూ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఇంటర్వ్యూ దృశ్యాల ప్రసారంపై నిషేధం  విధిస్తూ  కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ నోటీసులు జారిచేసింది. నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో చర్చ జరిగింది. నిర్భయ కేసులో దోషి ముఖేష్‌ ఇంటర్వ్యూను రాజ్యసభ ఖండించింది. డాక్యుమెంటరీపై తీసుకున్న చర్యలను సభకు తెలపాలని రాజ్యసభ చైర్మన్‌ హవిూద్‌ అన్సారీ సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సభకు వివరించారు. నిర్భయ డాక్యుమెంటరీపై మహిళా సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో ఆందోళన నేపథ్యంలో కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. డాక్యుమెంటరీ ప్రసారంపై ఆంక్షలు విధిస్తూ చర్యలు తీసుకున్నామని వివరించారు. జైలులో ఇలాంటి ఇంటర్వ్యూలకు అనుమతులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటన గురించి తెలియగానే బాధ కలిగిందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ… నిర్భయ డాక్యుమెంటరీపై సభ ఏకతాటిపై ఉందన్నారు. వెంటనే చర్యలు తీసుకున్న ¬ం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ… నిర్భయ డాక్యుమెంటరీపై ¬ం మంత్రి చర్యలు అభినందనీయమన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిర్భయ కేసులో దోషి ముఖేష్‌సింగ్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేయడంపై జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్భయ డాక్యుమెంటరీపై చర్చ చేపట్టాలని జేడీయూ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. తీవ్ర నేరానికి పాల్పడి జైలులో ఉన్న దోషి ఇంటర్వ్యూకి జైలు అధికారులు ఎందుకు అనుమతించారని ప్రశ్నించింది. ముఖేష్‌సింగ్‌ను రెండు రోజుల క్రితం బీబీసీ ఇంటర్వ్యూ చేసిన విషయం విదితమే. నిర్భయ కేసు దోషి ముఖేష్‌సింగ్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేయడంపై జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇందుకు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. ముఖేష్‌ ఇంటర్వ్యూకి యూపీఏ ప్రభుత్వ హయాంలోనే షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రసారం చేయొద్దని బీబీసీ ఛానెల్‌కు లీగల్‌ నోటీసులు పంపామని చెప్పారు. ముఖేష్‌ ఇంటర్వ్యూ పుటేజ్‌ను బీబీసీ తిరిగి ఇచ్చేసిందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.  నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో ఆందోళన నేపథ్యంలో కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. డాక్యుమెంటరీ ప్రసారంపై ఆంక్షలు విధిస్తూ చర్యలు తీసుకున్నామని వివరించారు. జైలులో ఇలాంటి ఇంటర్వ్యూలకు అనుమతులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ… నిర్భయ డాక్యుమెంటరీపై ¬ం మంత్రి చర్యలు అభినందనీయమన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.