నిర్భయ నిందితుని ఇంటర్వ్యూపై కేంద్రం సీరియస్
ఎఫ్‌ఐఆర్ నమోదు, తీహార్ జైలు డైరెక్టర్‌కు తాఖీదులు
వివరణ కోరిన హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఢిల్లీ, మార్చి3(జనంసాక్షి): నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు ముఖేష్ కుమార్ ఇంటర్వ్యూపై కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ సీరీయస్ అయింది. ఇంటర్య్వూను తీవ్రంగా పరిగణించిన కేంద్రప్రభుత్వం బాద్యులపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేయమని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. . దీనిపై వివరణ ఇవ్వాలని ¬ం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీహార్ జైలు డైరెక్టర్ ను ఆదేశించారు. ఇదిలా ఉండగా ముఖేశ్ మాటలు సిగ్గు చేటని, అతన్ని ఉరి తీయాలని నిర్భయ తల్లి దండ్రులు డిమాండ్ చేశారు. కాగా, బీబీసీ కోసం ముఖేశ్ తో మాట్లాడేందుకు 2013 లో అప్పటి తీహార్ జైలు డైరెక్టర్ విమాలా మెహ్రా నుంచి అనుమతి తీసుకున్నట్లు డాక్యుమెంటరీ నిర్మాత లెస్లీ ఉద్విన్ తెలిపారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసి కి ఇంటర్య్వూఇచ్చాడని చెబుతున్న ఒక వీడియో సోషల్ విూడియాలో హల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో అత్యాచారాలకు అమ్మాయిలదే ప్రధాన బాధ్యత అంటూ ముఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి . జైలు శిక్షవేసినా నిర్భయ దోషి మనస్తత్వంలో మార్పురాలేదనీ…అసలు జైల్లో ఉన్న దోషిని ఇంటర్య్వూ చేయడానికి ఎలా అనుమతిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ¬ం శాఖ రంగంలోకి దిగక తప్పలేదు.