నీటి ఎద్దడి కోతలు సామాన్యులకే కాదు
రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులకూ విధించండి
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి): దిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో సంచలనాత్మక నిర్ణయం వెల్లడించారు. వేసవిలో ఎద్దడి ఏర్పడితే కేవలం సామాన్యులకే కాకుండా.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రుల నివాసాలకూ నీటి సరఫరాను నిలిపివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులకు సూచించారు. బుధవారం ఢిల్లీ జల్ బోర్డుతో సమావేశం నిర్వహించిన ఆయన.. అవసరమైతే వీవీఐపీలకు కూడా వాటర్ సప్లై నిలిపేసేందుకు వెనకాడొద్దని అధికారులతో అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించడం చేతకాకుంటే అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి తప్పుకోవడం మంచిదని బీజేపీ ఎమ్మెల్యేలకు చెప్పానని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నందునే కార్పొరేషన్ నిర్వహణ కష్టతరంగా మారిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.