నులిపురుగుల నివారణ పై శిక్షణ

టేకులపల్లి, సెప్టెంబర్ 14( జనం సాక్షి ): సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మండలంలోని ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకు నులి పురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మింగించే కార్యక్రమం ఉన్నందున, దీనిపై బుధవారం సులానగర్ పి హెచ్ సి లో మండలంలోని సబ్ సెంటర్ల వైద్య సిబ్బందికి , అంగన్వాడీ సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్స్ కు, ఆశా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రేపటి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పైన పేర్కొనబడిన
1 నుండి19 సంవత్సరముల వయస్సు గ్రూపు పిల్లలందరికీ ఒకేరోజు దేశమంతా నులిపురుగుల నివారణ టాబ్లెట్లు మింగించడం ద్వారా నలుపురుగులను నివారించవచ్చునని వీటివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు సగం టాబ్లెట్, రెండు సంవత్సరాలు నిండిన వారికి పూర్తి టాబ్లెట్ తర్వాత మింగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, సూపర్వైజర్లు గుజ్జ విజయ, శకుంతల ,నాగుబండి వెంకటేశ్వర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు అనురాధ, లక్ష్మి, రోజా, కరుణకుమారి ,ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.