నెల రోజులు ఉద్యమం ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) :

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నెల రోజుల పాటు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శనివారం నగరంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్తగా చెప్పిందేమి లేదన్నారు. జనవరి 4న అన్ని నియోజకవర్గాల్లో లక్ష బైక్‌లతో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రం అఖిలపక్షం అనంతరం ప్రకటించినట్లుగా

నెలరోజుల్లోపు తెలంగాణ ప్రకటించాలని కోరుతూ 9న కాగడాల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఐదు వేల మంది సామూహిక నిరాహార దీక్షలు చేపడుతామని ప్రకటించారు. 23న జిల్లా కేంద్రాల్లో కవాతు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 26న తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. 30న మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.