నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

1

హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురవారం నుంచి  ప్రారంభం కానున్నాయి. గురవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేస్తారు. ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల ప్రవేశపెడుతారు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం అయి అసెంబ్లీ పనిదినాలను ఖరారు చేస్తుంది. వరుస ఎన్నకలతో జోరువిూదున్న అధికారపార్టీ

టిడిపి సభ్యులను మొత్తంగా టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న దశలో నేటి అసెంబ్లీ సమావేశాల్లో దాని స్థానం అయోమంగా మారింది. ఎన్నికల ఫలితాలు, మహారాష్ట్ర ఒప్పందం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేల చేరికపై ప్రధాన ప్రతిపక్షం నిలదీసే అవకౄవం ఉంది. ఇదిలావుంటే

టీఆర్‌ఎస్‌ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌ చేరుతున్న సంగతి తెలిసిందే. తమను కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని స్పీకర్‌ మధుసూదనా చారికి లేఖ రాశారు. దీంతో గ్రేటర్‌లో టీడీపీ ఖాళీ అయింది. ఎమ్మెల్యేలు మొదలుకొని మాజీ మంత్రులు, ముఖ్యనేతలు కలిసి ఒక్కొక్కరుగా వలసలబాట పట్టి గులాబీ కండువా కప్పు కున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రేటర్‌ నుంచి తొమ్మిది ఎమ్మెల్యేల స్థానాలు కైవసం చేసుకున్న పార్టీలో ఒక్క రంటే ఒక్క స్థానానికి ప్రస్తుతం దిగజారింది. అటు ఇటీవల జరిగిన కార్పొరేషన్‌లోనూ ఒక్క స్థానానికే సరిపెట్టుకుంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోక, తాజాగా గులాబీతీర్థం పుచ్చుకునేందుకు నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరి కపూడి గాంధీ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సీఎం కేసీఆర్‌ను కలిసిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మంగళవారం కూడా సీఎం కేసీఆర్‌ మరోమారు కలిసి చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఈనెల 11న సీఎం కేసీఆర్‌ సమక్షంలో అధికారపార్టీలో చేరనున్నారు.

దీంతో టీడీపీ నుంచి ఎల్పీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఒక్కరు ఒంటరి కావడం, గత కొద్ది నెలలుగా పార్టీ కార్యక్రమాలకు కృష్ణయ్య దూరంగా ఉండడం పార్టీ మనుగడ ప్రశ్నార్థకమేనన్న అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  దీంతో అసెంబ్లీలో రేవంత్‌ ఒక్కడే టిడిపి పక్షానుండే సూచనలు ఉన్నాయి.