నేడు ”ఎమ్యెల్సీ” కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

1

మార్చి 24 (జనంసాక్షి):  రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలకు బుధవారం ఓట్ల లెక్కింపు జరుపనున్నారు. ఈమేరకు ఎన్నికల అధికారి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒక టేబుల్‌కు ముగ్గురు కౌంటింగ్‌ ఏజెంట్లకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు రెండు షిఫ్టుల్లో అనుమతి ఉంటుందని వివరించారు. సిబ్బందికి మూడు షిఫ్టులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకు పెన్నులను అనుమతించమని తెలిపారు. మహబూబ్‌నగర్‌,రంగారెడ్డి, హైదరాబాద్‌ స్థానానికి హైదరాబాద్‌లో లెక్కింపు జరుతుంది. ఇక నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం స్థానానికి నల్లగొండలో లెక్కింపు జరుగనుంది.