నేడు మేడిగడ్డ బ్యారేజీ సీఎం శంకుస్థాపన

5

– కరీంనగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

కరీంనగర్‌,మే1(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు నేడు భూమిపూజను పురస్కరించుకుని నేడు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కరీంనగర్‌లోని ఉత్తర తెెలంగాణ భవన్‌లో ఘన స్వాగతం పలుకుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్‌ మధు సూధనాచారి, మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూ టీ స్పీకర్‌ పద్మ దేవేందర్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ తుల ఉమ, చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, కోరుట్ల, ఎంఎల్‌ఏ. వి ద్యాసాగర్‌ రావు, జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌, ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్‌, ఎంఎల్‌సి. నారదాసు లక్ష్మ ణ్‌రావు, నగర మేయర్‌ రవీందర్‌ సింగ్‌, ఎస్‌పి తదితరులు. సీఎం పర్యటన సందర్భంగా ఉత్తర తెెలంగాణ భవన్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.రాత్రి ఆయన తీగలగుట్టపల్లిలోని తన నివాసంలో బసచేస్తారు. సోమవారం ఉదయం హెలిక్టాపర్‌లో బయల్దేరి కాళేశ్వరం చేరుకుంటారు. ఉదయం 6.45కి అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి కన్నెపల్లికి వెళ్లి ప్రాజెక్టు పంపుహౌస్‌కు భూమిపూజ చేస్తారు. మళ్లీ కాళేశ్వరం వచ్చి అల్పహారం చేసి తదుపరి ఉదయం 9.40కి అంబటిపల్లి చేరుకుంటారు. అక్కడ 9.50కి మేడిగడ్డ బ్యారేజికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడి హెలికాప్టర్‌లో బయల్దేరి హైదరాబాద్‌ బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకుంటారు.