నేడు హైదరాబాదులో జరిగే కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాను విజయవంతం చేయండి !
భూపాలపల్లి (ప్రతినిధి) ఆగస్టు 2 జనం సాక్షి : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 ప్రకారం నెలకు 19531 రూపాయలు ,రోజుకు 751 రూపాయలు చొప్పున ఇవ్వాలని నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలోసింగరేణి లోని అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అసంఘటిత కార్మికుల వేతనాలు పెంచకుండా, కేంద్రంలో బిజెపి రాష్ట్రంలోటీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కేంద్రంలోబిజెపి ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా కనీస వేతనం జీవోలను విడుదల చేయడం లేదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ప్రక్క నిత్యవసర సరుకులధరలు ,పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా పెంచుతున్నాయన్నారు. మన వేతనాలు మాత్రం పెంచకుండా గొర్రె తోక బెస్తడులాగెను ఉంచుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు అసంఘటిత కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా 2021 జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఐదు షెడ్యూల్ పరిశ్రమలకు కనీస వేతన జీవోలను విడుదల చేసింది కానీ యాజమాన్యాల ఒత్తిడితో వాటిని గెజిట్ చేయకుండా నిలుపుదల చేసిందని అన్నారు. అందుకే జీవో 22 అమలు కోసం నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజయ్యవిజ్ఞప్తి చేశారు.