నేను అలా అనలేదు
– మహమూద్ అలీ
హైదరాబాద్,ఆగస్టు 26(జనంసాక్షి):వచ్చే ఒలింపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించేందుకు ప్రస్తుత కోచ్ గోపీచంద్ స్థానంలో మరో కోచ్‌తో శిక్షణ ఇప్పిస్తానని తాను అన్నట్లుగా వస్తున్న వార్తలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఖండించారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నారు. సింధుకు మంచి కోచింగ్ ఇప్పిస్తామని అన్నానే తప్ప గోపీచంద్‌ను తొలగిస్తామని అనలేదని ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను విూడియా తప్పుదోవ పట్టించడం వల్లనే గందరగోళం నెలకొందని అన్నారు. విూడియా వాస్తవానికి చేరువగా ఉండాలే తప్ప అవాస్తవాలను ప్రచారం చేయకూడదని సూచించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి వాటివల్ల తప్పుడు సమాచారం ప్రజలకు వెలుతుందన్నారు.