నేనే ఏ దేశ పౌరసత్వం అడగలేదు – రాహుల్‌

4

న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి):  ఏ దేశంలోనూ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. లండన్‌ పౌరస్త్వం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై రాహుల్‌ మండిపడ్డారు. ఇదంతా కుట్ర పూరితమన్నారు. భారతీయ జనతా పార్టీ తన ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. లోకసభ విలువల కమిటీకి ఇచ్చిన సమాధానంలో రాహుల్‌ ఈ విధంగా స్పందించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రిటీష్‌ పౌరసత్వం కోసం రాహుల్‌ దరఖాస్తు పెట్టుకున్నట్లు బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఎథిక్స్‌ కమిటీ సభ్యుడు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈనెల 15న రాహుల్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఓ లండన్‌ కంపెనీకి డైరక్టర్‌గా మారేందుకు రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. పార్లమెంట్‌ వ్యవహారాల ప్రకారమే రాహుల్‌ పౌరసత్వ అంశంపై ఎథిక్స్‌ కమిటీకి సమాధానం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా తెలిపారు.