నేరం – శిక్ష : బాల్ ఠాక్రే, అజ్మల్ కసబ్
ముంబైలో ఐదు సంవత్సరాలు కింద నవంబర్ 26 నుండి 29 వరకు పాకిస్తాన్ – ప్రేరేపిత తీవ్రవాదులు జరిపిన బాంబు దాడు లలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన వారిలో సజీవంగా దొరికిన ఒకే ఒక్క వ్యక్తి అజ్మల్ కసబ్ అనే పాకిస్తాన్ పౌరుడు రెండు సంవ త్సరాల విచారణ ప్రక్రియ తర్వాత 2010 మేలో కసబ్‌కు న్యాయ స్థానం మరణశిక్ష విధించింది. ఆ శిక్షను రాష్ట్ర హైకోర్టు, సుప్రీ కోర్టు కూడ నిర్థారించాయి. చివరి అవకాశంగా పెట్టుకున్న క్షమా భిక్ష దరఖాస్తును రాష్ట్రపతి నవంబర్ 5న నరాకరించారు. ఆ తర్వాత నవంబర్ 21 ఉదయం కసబ్‌ను ఎరవాడ జైలులో ఉరితీశారు. ఈ చట్టబద్ద హత్యకు దేశంలో చాలమంది ఆనందోత్సా హాలతో స్పందించి ఉత్సవంగా జరుపుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రచార, ప్రసార సాధనాలన్నీ మితిమీరిన దేశభక్తితో ఉరి వార్తను, ఉరి తర్వాత దాన్ని సమర్దించే చర్చలను చేపట్టాయి. ముంబై దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ ‘ప్రతీకారా నికి’ సంతోషం వ్యక్తం చేసి ఉంటే, వారలోని వ్యక్తిగత ప్రతీకార వాంఛను అర్ధం చేసుకోవచ్చు గాని, ముంబైతోనూ, ఆ ఘటనల తోనూ ఏ సంబంధమూ లేనివారు కూడా సంతోషపడ్డారని వార్తలు వచ్చాయి. అంటే వాళ్లు కసబ్‌న చేసినది ఒక నేరంగా గుర్తించి, దానికి శిక్ష పడినందరుకు సంతోషిస్తున్నారనుకోవాలి. మరి కసబ్ చేసిన నేరాల కన్న ఘోరమైన నేరాలు చేసిన, కసబ్ చంపినవారి కన్న ఎక్కువ మందిని చంపిన, చంపించిన మరొక వ్యక్తి అదే ముంబైలో సరిగ్గా రెండు రోజుల ముందు చనిపోయినప్పుడు ఎవ రూ సంతోషించినట్టు వార్తలు రాలేదు సరిగదా, రాష్ట్రపతి నుంచి సాదారణముంబైకర్ దాకా చాల మంది విచారం, సంతాపం ప్రకట ించారు. ముంబై జైలు నుంచి ఎరవాడ జైలుకు మార్చి కసబ్‌ను ఉరి తీయడానికి మూడు రోజుల ముందు అదే ముంబైలో చనిపోయిన వ్యక్తి పేరు బాల్ ఠాక్రే. ఆయన గుండెపోటుతో మరణిస్తే ముంబ ైలో నిర్భంధంగా బంద్ జరిపారు. కసబ్ మూడు రోజులపాటు ఒక నేరం చేసి, 164 మందిని చంపాడేమోగాని, బల్ ఠాక్రే అలువంటి నేరలే నలభై సంవత్సరాలకు పైగా చేస్తూ వేలాది మంది హత్యలకు దారితీసిన రాజకీయాలు నడిపాడు. ద్వేషభావం రెచ్చగొట్టాడు. మరి ఒకరి నేరానికేమో ఉరిశిక్ష అమలు జరగగా, మరొకరి నేరానికేమో శిక్ష లేకపోవడం మాత్రమే కాదు, విచారణ కూడ జరపలేదు. అంటే ఈ దేశంలో నేరాలన్నీ ఒకటి కావన్నమాట. అన్ని నేరాలకూ శిక్షలు పడవన్నమాట. నేరాలు చేసిన వారందరూ చట్టం ముందర సమా నం కాదన్నమాట. నురలు చేసి వారందరూ చట్టం ముందర సమా నం కాదన్నమాట. చేసిన మనిషి ఎవరనేదాన్నిబట్టి ఆ నేరం శిక్షా ర్హమైన నేరంగానో, విచారణా తీత నేరంగానో మారిపోతు ందన్నమాట ఇద్దరూ మనుషులను చంపినవాళ్లే అయినప్పటికీ ప్రచార సాధనాలు ఒకరి గురించి ముష్కరుడు, కరుడుగట్టిన ఉగ్రవా ది, ఖతం లాంటి మాటలు వాడా యి. అంటే నేరం, శిక్ష విషయాల్లో అందరికీ సమానంగా వర్తించే తటస్థ ప్రమాణాలు లేవ న్నమాట. మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ పాకిస్తాన్‌లోని పంజా బ్‌లో ఫరీద్ కోట్ గ్రామానికి చెందన నిరుద్యోగ యువకుడు, తండ్రి తోపుడు బండి మీద రొట్టెలు అమ్ముకుంటూ తిరిగి జీవనం గడిపే వాడు. అటువంటి కటిక దారిద్య్రంలో మగ్గుతూ, పెద్దగా చదువు కోని కసబ్ ఏదో ఒక ఉపాధి కోసం వెతుకుతూ, లష్కర్ ఎ తయో బాలో చేరి, ఫిదాయీగా మారడం ఒక ఉద్యోగంగానే చేశాడనే అన్ని కథనాలూ చెపుతున్నాయి. రమత భావాలతో ప్రేరేపితుడై, తాను చే యబోతున్నది మహాకార్యమని, దా నికి ప్రతిఫలంగా స్వర్గంలో భగ వంతుని పక్న స్థానం దొరు కుతుందని హామీ దొరికి ముంబై మారణకాండకు పాల్పడ్డాడు. అది కసబ్‌కు ప్రత్యేకం కాదు, ఇస్లాంకు ప్రత్యేకం కాదు. అటువంటి నిస్స హాయ స్థితిలో ఉన్న ఏ మతంలోని వ్యక్తి అయినా అటువంటి ఉద్యోగా నికి సిద్దపడవచ్చు. భారత్ లోనై నా, పాకిస్తాన్ లోనైనా మనుషుల్ని చంపే, నేరాలు చేసే వృత్తిని ఉద్యోగంగా ఎంచుకోక తప్పని ఆర్థిక దుస్థితిలో యువత ఉన్నందుకు వ్యవస్థలు తలవంచుకోవాలి. పండుగకు కొత్త బట్టలు కుట్టించమని అడిగితే తండ్రి కాదన్నాడని కకసబ్‌న పద్దెనిమిదో ఏట ఇంటి నుంచి పరిపోయాడు. రెండేళ్ల పాటు చిన్న చితకా దొంగతనాలతో పొట్టపోసుకుని, 2007 లష్కర్ ఏ తయోబా ప్రభావంలోకి వచ్చి, ఆయుధ శిక్షణ పొందాడు, ఇరవై ఒకటో ఏట 2008 నవంబర్ 23న మరొక తొమ్మిది మందితో కలిసి కరాచీలో బయల్దేరి, సముద్రం మధ్యలో భారతీయ చేపలప డవలోకి మారి ముంబైకి అతి సులభంగా చేరగలిగాడు. వీపున సంచీతో, చంకలో ఎకె 47తో ఛత్రపతి శివాజీ టర్మినస్‌లో ప్లాట్ ఫారంపై నడుస్తున్న కసబ్ అక్కడి సిసిటివి కెమెరాకు చిక్కాడు అక్కడా, మెట్రోసినిమా దగ్గరా కాల్పులు జరిపి, చౌపాటీ వైపు వెళ్తుండగా జరిగిన కాల్పులలో గాయపడి పోలీసులకు దొరికాడు. కాల్పులు, పేలుళ్లు జరిగిన అన్ని ప్రాంతాలలోనూ నేరస్థులు కాల్పులలో హతులైపోగా, మొత్తం నేరస్తులు బృందంలో సజీవంగా పోలీసుల చేత చిక్కినది కసబ్ మాత్రమే. పదకొండు వేల పేజిలకు మించిన ఛార్జిషిట్‌లో ప్రాసిక్యూషన్ కసబ్ మీద ఎనభై నేరారో పణలు చేసింది. అసలు తనకు ఈ ఘటనలతో ఏ ప్రమేయమా లేదని, ఉద్యోగం కోసం వెతుకులాటలో ముంబై వచ్చానని, ఈ ఘటనలు జరగడానికి మూడు రోజుల ముందే తనను పోలీసులు అనుమానస్పదంగా తిరుగుతున్నాడని అరెస్టు చేశారని కసబ్ మొదట చెప్పాడు. తాను పాకిస్తాన్ పౌరుడినని, లష్కర్ ఎ తయోబా శిక్షణ ఇచ్చి ఈ విధ్వంసకాండ కోసం పంపిందని మరొకసారి చెప్పాడు. కసబ్ ఒప్పుకోలు ప్రకటన అంటూ పోలీసులు ప్రకటించినది కనీసం మూడు సార్లు మారింది. కసబ్ తరపు న్యా యవాదుల మీద హిందుత్వ శక్తులు చేసిన దాడులవల్ల ప్రభు త్వం మొక్కుబడిగా అందించిన న్యాయసహాయం తప్ప సమర్ధమైన న్యాయసహాయం అందలేదు. ఎంతో మంది అమాయకులు మరణించి,విధ్వంసం జరిగిన నేపథ్యంలో న్యాయ విచారణ కూడ బావోద్వేగాలతో జరిగిందిగాని, నిష్పక్షపాతంగా, సత్యాన్వేషణ దృష్టి తో జరగలేదు. ఈ నేర విచారణ కోసయే ఏర్పాటయిన ప్రత్యేక న్యాయస్థానం చివరికి 2010 మే 6న కసబ్‌కు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడ దృవీకరించాయి. మరణశిక్ష పడిన నేరస్తులు చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి అభ్యర్థన పెట్టుకునే అవకాశం ఉంది. కసబ్ ఆ ఆభ్యర్థనను కూడా చేయగా , ప్రతిభాపాటిల్ తన పదవీ కాలంలో కసబ్ అభ్యర్థనను తిరస్కరించకుండ, ఆమోదించకుండా అలా ఉంచారు. రాష్ట్రపతిగదా జూలై 25న పదవీ స్వీకరించిన ప్రణ బ్ ముఖర్జీ వందరోజలు గడవకుండానే నవంబర్ 5న ఆ అభ్య ర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రెండు వరా లకే మరణశిక్ష అమలయి పోయింది. నిజానికి కసబ్ విచారణకు, ముంబై విధ్వంసకాండ విచారణకు సంబంధించి కీలకమైన ప్రశ్నలెన్నో మిగిలే ఉన్నాయి. అంత సులభంగా ఆగంతుకులు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించగల అవకాశం ఎలా వచ్చింది? తీర రక్షణ దళం, నావికాదళం, వైమానిక దళం, సరిహద్దు భద్రతా దళం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాధారణ పోలీసులు వంటి వందలాది, బహుశా వేలాది భద్రతా సిబ్బంది, ఈ పది మంది ఆగంతకులు పాకిస్తాన్ సరిహద్దుల్లోంచి బారత సరిహద్దుల్లోకి వచ్చి, ముంబైతీరంలో ప్రవేశిస్తుండగా ఏం చేస్తున్నారు? భారత భద్రతా బలగాల ఈ తప్పును ఎవరూ వేలెత్తి చూపలేదు. ముంబై నగరంలో అత్యున్నత భద్రత ఉండే ప్రాంగణాలలోకి సాయుధ ఆగంతుకులు ఎలా ప్రవేశించగలిగారని విచారణే జరగలేదు. ఇంతగా విదేశీ శక్తుల, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న నేరాన్ని సరిగా విచారించాలంటే ఆ నేరస్తులను సజీవంగా పట్టుకుని వివరాలన్నీ సంపాదించాలని భద్రతా బలగాలు అనుకోలేదు. నేరస్తులకు ముంబైలో ఆశ్రమాలు,వాహనాలు, నిధులు సమకూ ర్యినవారెవరో విచారణ జరగలేదు. వారు కాల్పులకు ముందు పోలీసు వాహనాలలోనే ప్రయాణించారని ఆధారాలున్న ప్పటికీ, వారు భయపెట్టి ఆ వాహనాలను చేజిక్కించుకున్నారనే కల్లబొల్లి వాదనలు తప్ప, నిజంగా ఆ వాహనాలు వారి చేతికి ఎలా చిక్కాయన్న విచారణ జరగలేదు. ఆ దాడులలో సూటిగా కాల్పులకు గురయి మరణించిన పోలీసు అధికారి హేమంత్ కర్కారే అంతకుముందు హిందుత్వవాదులను ఎదిరించిన చరిత్ర గలవాడని, ఆయన మీద హిందుత్వవాదులే ఎక్కుపెట్టి ఉండవ చ్చునని వచ్చిన ఆరోపణలకు నమ్మదగిన జవాబు లేదు.
– ఎడ్ల పోచయ్య