నేరం ` శిక్ష : బాల్ ఠాక్రే, అజ్మల్ కసబ్
(శనివారం తరువాయి భాగం)
కనుక మొత్తం మీద చూస్తే కసబ్ నేరస్తుడని ఒప్పుకున్నా మిగిలిపోయే ప్రశ్నలున్నాయి. నేరస్తుడు కాకపోవచ్చునని, పోలీసులు బనాయించే సాధారణ తప్పుడు కేసులలో ఇదీ ఒకటి కాకపోవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. ఇంత అనుమా నాస్పదమైన పునాదీ మీద ఒక మనిషి ప్రాణాలను చట్టబద్దంగా తీ యడం జరిగిపోయింది. అది కూడ అసాధారణమైన తొందం పాటుతో, రహస్యంగా జరిగిపోయింది. ఇక మరణశిక్ష అమలు చేసిన సందర్బం చూస్తే ప్రభుత్వం శిక్ష అమలు జరపడం కన్న, చట్టబద్ధ నిబంధనలు పాటించడం కన్న తన స్వప్రయేజానాలు ముఖ్యమని భావించిందని అర్ధమవుతుంది. ముంబై దాడులు జరిగి సరిగ్గ నాలుగు సంవత్సరాలు నిండడానికి సరిగ్గా నాలుగు రోజులు ముందు ప్రతీకాత్మకంగా ఈ శిక్ష అమలు జరిగింది. చిల్లర వర్తకంలోకి విదేవి ప్రత్యేక్ష పెట్టుబడుల అనుమతి మీద వివాదా స్పదమైన పార్లమెంట్ శీతకాలం సమావేశాలు ప్రారంభం కావడా నికి ఒక్కరోజు ముందు ఈ ఊరిశిక్ష అమలయింది. మరోక మూడు వారాల్లో జరుగనున్న గుజరాత్ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకో వడానికి, మోడీ కన్న తామే ఎక్కువగా ముస్లిం వ్యతిరేకులమని, హిందూ ప్రజల సంరక్షకులమని చెప్పుకోవాడానికి కాంగ్రెస్ ఈ ఉరిశిక్ష అమలు చేసింది. మరణశిక్షను రదుదÊ చేయాలనే తీర్మానానికి వ్యతిరేఖంగా ఐక్యరాజ్య సమితి లో భారత ప్రతినిధి మాట్లాడిన రోజునే ఈ మరణశిక్ష అమలయింది. కజబ్ మరణశిక్ష అమలు కాగానే హిందూత్వ శక్తులు ‘ఇక అఫ్ఘల్ గురును ఊరితీయాలి’ అనే ప్రచారం ప్రారంభించారు. స్వయంగా మోడీ తన ట్వాట్టర్ సందేశంలో ఈ మాట రాశాడు. అఫ్ఘల్ గురు పార్లమెంట్‌పై దాడి కేసులో నిందితుడు. ఉరిశిక్ష 2004లో విధించ బడినా, ఇంకా అమలు కాలేదు. కాని అఫ్ఘల్ గురు పార్లమెంట్‌పై దాడికి కుట్ర పన్నాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. ‘ఈ నిందితడు నేరం చేశాడని నమ్మదగిన సాక్ష్యాధారాలేమీ లేనప్పటీకి, నేరస్తుడికి మరణశిక్ష విధిస్తేనే, సమాజాపు సాముహిక అంతరాత్మ సంతృప్తి చెందుతుంది’ అని నిస్పిగ్గుగా, నేరం చేసినట్లు రుజువు చేయకపోయినా ప్రతీకార వాంఛాను సంతృస్తి పరచడం కోసం ఉరిశిక్ష విధించమాని స్వయంగా సుప్రీంకోర్టు తీర్పులోనే రాశారు. మరోకవైపు నుంచి చూస్తే, సరిగ్గా కసబ్ చేసినలాంటి నేరాలనే భారత ప్రభుత్వం తరుపున పాకిస్తాన్‌లో చేసిన సరబ్‌జిత్ సింగ్ ఉన్నాడు. లాహోర్ లోనూ, ఫైసలాబాద్‌లోనూ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో సరబ్‌జిత్ నేరస్తుడని, సరిగ్గా భారత న్యాయస్థానాలు కసబ్ విషయంలోవిచారణ జరిపి తేల్యినట్లే, పాకిస్థాన్ న్యాయస్థానా లు నిర్ధారించి 1991లోనే మరణశిక్ష విధించాయి. ఆ మరణశిక్ష ఇంకా అమలు చేయలేదు. సరబ్ జిత్‌కు క్షమాభిక్ష పెట్టాలని, వదిలెయ్యాలని, భారత ప్రభుత్వం ఇన్నాళ్లుగా పాకిస్థాన్ ప్రభుత్వం తో రాయబారాలు నడుపుతున్నది. మరి లాహోర్, ఫైసలాబాద్ పేలుళ్లు, మారణకాండ శాంతియుతమైనవీ, ముంబై పేలుళ్లు, మారణకాండ మాత్రం నేరాలు ఎలా అవుతాయి? సమాజంలో శాంతి భద్రతాలు సక్రమంగా కొనసాగాలని,ఆ శాంతి భద్రతలను భంగపరచడం నేరమని, ఆ నేరం చేసిన శిక్ష విధించాలని, ఆ శిక్ష ఇకముందు నేరం చేయదలచిన వారికి బెదురుగా నిలుస్తుందని, నేరం-శిక్ష ప్రక్రియ సమాజాన్ని శాంతిభద్రతలతో ఉంచుతుందని చాల మంది నమ్ముతారు. ప్రతి నేరానికీ శిక్ష ఉండాలనేది సాధారణాంగా అంగీకరించదగిన విలువే. కాని నేరం అంటే ఏమిటి అని నిర్వచించబూనుకుంటే, సమాజంలో నేరాలుగా వేటిని పరగణిస్తారో చూస్తే, శిక్షల తీరును, పర్యవసానాలను చూస్తే ఇది అంత సూలభమైన వ్యవహరం కాదనీ తేలిపోతుంది. ఒక వ్యక్తో, ఒక సమాజమో ఏదయినా చర్యనూ నేరం అనుకున్నంత మాత్రాన అది నేరం కాదు, చట్టంలో క్రోడికరించబడినది మాత్రమే నేరం అవుతుంది. మరి చట్టాలను తయారుచేసే అధికారం ఉన్నవారు తమ ఇష్టారాజ్యాంగా నేరాలను నిర్వచిస్తే… వాటికి శిక్షలను విధిస్తే అంగీకరించవలసిందేనా? అందుకే నేరం-శిక్ష ప్రక్రి య చాల సంక్లిష్టమైనది. అనేక చారిత్రక, రాజకీ యార్థిక, సాయాజిక, సం స్కృతిక అంశాలతో కలగ లిసినది. అసలు ఒక నేరా నికి విధించే శఙక్ష సమా జంలో ఆ నేరాలు మళ్లీ జరగకుండా శిక్షణా ఇవ్వ గలిగిన, మానసిక పరివ ర్తన తేదగిన సామార్థ్యం నేరం జరగడానికి అవకా శం వస్తున్నదో ఆ మూల కారణాలను తొలగించగలిగినదీ, తగ్గించగలిగినదీ అయి ఉండాలి. కాని ప్రస్తుత శిక్షలేవీ అంత విశాలమైన సంస్కరణ దృష్టిగానీ, రాజకీయార్థిక దృష్టిగానీ కలిగినవి కావు. తమ పాలన సజావుగా సాగడం కోసం బ్రిటిష్ భారత పాలకులు నేరం-శిక్ష ప్రక్రియ గురించి అంత నిశితమైన వైఖరి తీసుకుంటారని ఆశించలేం. కాని మాములు మధ్య తరగతి వ్యాఖ్యతలు శిక్షలను, ముఖ్యంగా మరణశిక్షను సమర్థించేటప్పుడు, ఇకముందు అటువంటి నేరం జరగకూండ బెదురు కలిగించేలా శిక్ష ఉండాలని వాధిస్తారు. సమాజంలో ఎంత తవ్రమూనా శిక్షలు అమలవుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ పదే పదే అవే నేరాలు జరుగుతూ ఉండడమే ఈ వాదన డొల్ల వాదన అని చెప్పడానికి ఉదాహరణ. నిజంగానే శిక్షలు బెదురుగా పనిచేస్తే ఇన్ని నేరాలు జరుగుతూనే ఉండేవి కావు. నిజానికి ఈ వాదన చేసేవారికి నేరాలు ఎందుకు జరుగుతాయో తెలియదు. అసలు నేరం అంటే ఏమిటి, పాలకవర్గాలు, చట్టాలు నిర్వచించినదే నేరమా వంటి తాత్విక ప్రశ్నలను కాసేపు పక్కన పేట్టినా, నేరాలు జరగడానకి మూడు రకాల కారణాలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న రాజకీయ, ఆర్థిక, సాయజిక, సంస్కృతిక పరిస్థితుల ఒత్తిడి వల్ల జరిగేవి యమొదటి రకం. అటువంటి ఒత్తిడి వల్ల నేరాలు జరుగుతాయి గనుక ఆ నేరాలను ఏవో బెదురులు చూపి ఆపడం సాధ్యం కాదు. రెండో రకం నేరాలు క్షణికావేశానికి గురి చేసేవి. ఆ నేరాలు స్వభావం వల్లనే మనుషులు ఉద్ధేశపూర్వకంగా, ఆలోచించి చేసేవి కావు. అప్పటికప్పుడు భావోద్వేగం తోసుకువస్తే చేసేవి. ఆ భావోద్వేదంలో తాను చేసేది నేరమని, దానికి శిక్ష ఉంటుందని బెదిరే సమయం గాని, ఆలో,న గాని ఉండే ఆవకాశం లేదు. ఇక మూడో రకం నేరాలు పథకం ప్రకారం, ఉద్ధేశ పూర్వకంగా, నేరానికి సంపూర్ణ ప్రణాళిక రచించుకోని, వ్యూహం పన్ని చేసే నేరానికి ఫలానా ఫలానా శిక్షలు ఉన్నాయని సంపూర్ణంగా తెలుసు. వారికి ఆ శిక్షలు బెదురే ఉండదు. అంటే ఎలా చూసినా శిక్ష అనేది నేరస్తులకు బెదురుగా పనిచేస్తుందని, అందువల్ల మరణశిక్ష లాంటి పెదÊ శిక్షలు ఉండవలసిందేనని చేసే వాదనలకు అర్థం లేదు. అవి ఎప్పటీకీ తాము అనుకున్న ఫలితాన్ని కూడ సాధించలేవు. మరి మరణశిక్షకు, లేదా ఇటువంటి పెద్ద శిక్షలకు సమర్థన ఎక్కడినుంచి వస్తున్నది? ఇవి కేవం ప్రతీకారవాంఛ నుంచి పుట్టినవి. అవతతలి వల్లకు నష్టం, భాద కలగజేశారు. కాబట్టి వాళ్లకు మనం అంతే సమానమైన నష్టాన్ని, భాదను కలగజయాలి. ఆని బహూశా ప్రతివ్యక్తి అనుకుంటారు. వ్యక్తిగత స్థాయాలో ఉండే ఈ ప్రతీకారచవాంచ వల్లనే కసబ్ ఉరితీత జరగగానే ముంబై మారణకాండ బాధిత కుటుంబాలు సంతోషించాయి. కాని కంటికి కన్ను, పంటికి పన్ను అనే కొన్ని శతాబ్ధాలుగా మానవజాతి ఆలోచిస్త్తున్నది. వ్యక్తి తన పట్ల జరిగిన నేరానికి ప్రతకారం తీసుకోవాలనే కోరికతో కంటికి కన్ను, పంటికి పన్ను కొరతాడాని, అందువల్ల ఆ ప్రతీకారం తీర్చుకునే అవకాశన్ని బాధిత వ్యక్తికి ఇవ్వగూడదని, సమాజంలోని భిన్న ప్రమోజనాల మధ్య సమన్వయం కుదిర్చే రాజ్యమే ఆ ప్రతీకార బాధ్యతనుగ వహిస్తుందని, ఆ ప్రతీకారాన్ని నాగరిక పద్దతుల్లో సాదిస్తుందని ఆధునిక చట్టబద్ద పాలాని ఉన్నా, హత్యా నేరాలలో మాత్రం బాధితుల తరుపున ప్రభుత్వమే వాదిస్తుంది.జ కంటికి కన్ను, పంటికి పన్ను అని Êఓరపతి ఒక్కరూ అనుకుంటే మొత్తం సమాజమే గుడ్డిదై పోతుంది. అని గాంధీ అన్న మరణశిక్షను దృష్టిలో పెట్లుకున్నదే. ఈ ప్రతీకారం గురించి, నేరానికి తగిన శిక్ష ఉండడం గురించి వాదించే మధ్యతరగతి అన్ని నేరాల గురించీ ఇలాగే ఆలోచిస్తుందా అని చూస్తే దాని వాదనల దివాళాకోరుతనం మరింత బయటపడుతుంది. అణగారినవర్గాలు, అధికారంలో లేని వర్గాలు, నిస్సహాయ వ్యక్తులు, బృందాలు చేసే ‘నేరా’లకు కఠిన శిక్షలు విధించాలని, మరశిక్ష తప్పనిసరిగా ఉండాలని వాదించేవారు. ఆధిపత్య వర్గపు నేరాల విషయంలో, పాలకవర్గ విధానాలే నేరాలుగా మారే సందర్భాలలో తమ నేర నిర్వచనాన్ని మార్చేసుకుంటారు. ఆస్తి, అగ్రవర్ణం, మెజారిటీ మతం, పురుషాధిత్యం, పెద్ద వయస్సు, అభివృద్ధి చెందిన ప్రాంతం వంటి అవకాశాలు ఉన్నావారు చేసే నేరాలుగా కనబడవు. వాటికి శిక్షలు విధించాలని ఎవరూ గొంతెత్తి పలకరు. ఇక అధికారాన్ని చేపట్టిన పాలకవర్గ విధానాల పర్యవసానాలను నేరాలుగా గుర్తించడం, వాటికి శిక్షలు పడాలని కోరడం అసాధ్యమే అవుతుంది.
కనబ్ కొన్ని మరణాలకు, 164 మందో, 167 మందో మరణించడానికి ప్రత్యక్ష బాధ్యుడు గనుక ఉరి తీయవలసిందే అని వాదించేవారు. అటువంటి మరణాలకే కారణమవుతున్న ఇతర నేరస్తుల గురించి పట్టించుకుంటారా..? ఉత్పత్తి సాధనాలను తమ గుప్పెట్లో పెట్టుకునిన, ఆశేష పీడిత ప్రజానీకాన్ని, ఆకలికీ, చీకటికీ, ఆనారోగ్యానికి అవిద్యకూ, నిరుద్యోగానికి గురిచేస్తున్న, అందువల్ల కోట్లాది మంది మరణాలకు కారణమవుతున్న నేరస్తులను ఎలా శిక్షించాలి..? తోటి మానవుల పట్ల కుల వివక్ష చూపుతూ కోట్లాది మందిని అవమానానికి నిరాదరణకూ, దారిద్య్రానికీ గురిచేస్తున్న అగ్రవర్ణాల నేరాలు ఎక్కడయినా నమోదవుతున్నాయా, వాటికి శిక్షలు పడుతున్నాయా? స్త్రీని అసమనంగా చూసి, భ్రూణ హత్యల నుంచి వరకట్నపు చావుల దాకా తక్షణ హత్యలకూ, బతికి ఉండనిచ్చినా దుర్మార్గమైన అసమానతకూ వివక్షకూ, దీర్ఘకాలిక హత్యలకూ గురిచేస్తున్న పితృస్వామిక, పురుషాధిపత్య అహంకారాన్ని నేరంగా గుర్తిస్తారా..? ఆ నేరానికి శిక్ష విధిస్తారా..?
` ఎడ్ల పోచయ్య
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…