పంచతంత్రం

2

– 5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

– పశ్చిమ్‌బంగా, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో ఎన్నికలు

న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి):  ఐదు రాష్ట్రాల్లో త్వరలో  జరగబోయే ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. పశ్చిమ్‌బంగా, తమిళనాడు, కేరళ, అసోం, రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి కూడా ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేసినట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ వెల్లడించారు. ఆయా రాష్టాల్ల్రో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్టాల్ల్రో 1070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. రాష్టాల్ర వారీగా దశలు, నియోజకవర్గాలు, పోలింగ్‌ తేదీలు, ఇతర వివరాలు ప్రకటించారు. అసోంలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నసీమ్‌ జైదీ వెల్లడించారు. తొలి విడత పోలింగ్‌ ఏప్రిల్‌ నాలుగున, రెండో విడత ఏప్రిల్‌ 11న జరగనున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఆరు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్‌ నాలుగున జరగనుంది. రెండో విడత ఏప్రిల్‌ 17న, మూడో విడత ఏప్రిల్‌ 21న, నాలుగో విడత ఏప్రిల్‌ 25న, ఐదో విడత ఏప్రిల్‌ 30న, ఆరో విడత మే ఐదున జరగనున్నాయి. కేరళ అసెంబ్లీకి ఒకే విడతలో మే 16న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఒకే విడతలో మే 16న అసెంబ్లీ జరగనున్నాయి. మే 19న కౌంటింగ్‌ ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు అదే రోజు కౌంటింగ్‌ జరుపుతారు. నక్సల్స్‌ ప్రభావిత పశ్చిమబెంగాల్‌లోని 295 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 4, 17, 21, 25, 30, మే ఐదున మొత్తం ఆరు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఒకే విడతలో మే 16న ఎన్నికలు జరగనున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు, 30 స్థానాలున్న పుదుచ్చేరిలోనూ ఒకే విడతలో మే 16న అసెంబ్లీ జరగనున్నాయి. మే 19న కౌంటింగ్‌ ఉంటుంది. శాంతి భద్రతల విషయం కారణంగా అసోంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాంతి భద్రతలకు సంబంధించిన ఇబ్బందులు లేకపోవడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.  బంగాల్‌, అసోంలోని పోలింగ్‌ కేంద్రాలకు పారా మిలిటరీ బలగాలతో భద్రత కల్పిస్తారు.

ఈవీఎంలో గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలు పెడతారు.  మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది కూడా మహిళలే ఉండేలా చూస్తున్నారు.