పంచాయితీల పరిపుష్టితోనే దేశ అభివృద్ది సాధ్యం
ప్రజాస్వామ్యానికి పంచాయితీరాజ్ వ్యవస్థ పునాది లాంటిది. గ్రామాలను బలోపేతం చేసి పంచాయితీ ఆధ్వర్యంలో పనులు చేపడితే గ్రావిూణ వికాసం తద్వారా జిల్లా, రాష్టా, దేశ వికాసం జరుగుతంది. పంచాయితీలకు అధికారాఉల, హక్కులు, బాధ్యతలు అప్పగించినప్పుడే దేశం ముందుకు సాగగలదు. అయితే ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఈ దిశగా విపల్వాత్మక మార్పులు రావడం లేదు. పెత్తనం అంతా పైనుంచి జరగడంతో గ్రామస్థాయిలో అభివృద్ది కదలడం లేదు. అందుకే గ్రామాల్లో మంచినీరు మొదలు, పారిశుద్యం, పర్యావరణ సమస్యలు తీవ్రం అవుతున్నాయి. ఇవన్నీ కూడా మన పురోభివృద్దికి గుదిబండా మారాయి. గ్రామాల్లో మంచినీటి వ్యవహారం ఇప్పుడు పంచాయితీల చేతల్లో లేకుండా పోతోంది. పారిశుద్యానికి నిధుల కేటాయింపు లేదు. అలాగే గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గ్రావిూణాభివృద్ధికి చేపడుతున్న అన్నిపనులు పంచాయితీల పరిధిలోకి తీసుకుని రావాలి. అయితే ఇది డిమాండ్‌గానే మిగిలిపోయింది. పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాబల్యానికి గండిపడుతుందనే భయంతోనే కొందరు స్వార్థ నాయకులు ఇందుకు అడ్డుపడుతున్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా గ్రామాలపై దృష్టిపెట్టి చట్టాలు చేసి పథకాలన్నీ గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో నడిపించేలా చేసివుంటే బాగుండేది. కానీ రకరకాల పథకాలు, రకరకాల నిధులు, రకరకాల పనుల కారణంగా పంచాయితీల పాత్ర పరిమితంగా మారింది. అంతేకాదు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. విద్యాకమిటీలు,సాగునీటి సంఘాలు, వనరక్షక కమిటీలు తదితర కమిటీలను పంచాయితీలకు సమాంతరంగా ఏర్పాటు చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. గ్రామాభివృద్ధికి ఉద్దేశించిన అనేకపథకాలు వారి ప్రేమయం లేకుండానే జరిగిపోతున్నాయి. రాష్టాల్రకు మరిన్ని అధికారాలు కావాలని కేంద్ర ముందు, నీతి ఆయోగ్ ముందు కోరుతున్న రాష్టాల్రు పంచాయితీలను మాత్రం బలోపేతం చేయడానికి సాహసించడం లేదు. స్థానిక సంస్థలకు అధికారాలతో పాటు, బాధ్యతలను బదలాయిస్తే రాష్ట్రం వేగంగా పురోభివృద్ది చెందగలదు. నిజానికి పల్లెలే ప్రగతికి మూలం.అందుకే గ్రామ పంచాయితీలను బలోపేతం చేయాలని స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా కృషి జరగాలని స్థానిక అవసరాలు, సమస్యలు, గ్రామస్థాయిలోనే పరిష్కరించే విధంగా నిబంధనలను, చట్టాలను రూపొందించాల్సి ఉంది. గ్రామపంచాయితీల స్థాయి నుంచి గ్రామాభివృద్ధికి శ్రీకారం చుడితే, అన్ని సమస్యలను దాని పరిధిలోకే తీసుకుని వస్తే, అందుకు ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తే ఈ నాటి దుష్ఫలితాలు వచ్చి ఉండేవి కావు. పథకాల రూపకల్పన, వాటి అమలు ప్రణాళిక అంతా గ్రామాల్లో ప్రారంభం కావాలి. గ్రామస్వరాజ్యాన్ని ప్రతిబింబించాలి అనేది 73వ రాజ్యాంగ సవరణ ప్రధాన లక్ష్యం. ఈ సవరణ జరిగి నాలుగు దశాబ్దాలు అవుతున్నా నేటికీ పల్లెసీమల ప్రగతి అక్కడికి చేరలేదనే చెప్పాలి. పరిపాలన, విద్యా, వైద్యం,తాగునీరు తదితర మౌలిక వసతులు ఇలా ఎన్నో అంశాల్లో స్థానిక సంస్థలకు నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడానికి రాష్టాల్ర పెత్తనం తప్ప మరోటి కాదు. పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న పాలకులు ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు వీసమెత్తు కూడా చేయలేకపోయారు. పంచాయితీరాజ్ వ్యవస్థ ద్వారా రాజకీయ ప్రవేశంచేసి అంచలంచెలుగాఎదిగి మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అయిన వారు సైతం పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఏనాడు అడుగు వేయలేదు. గ్రావిూణ ఆర్థిక వికాసం గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోడీ హయాంలోనూ ఇక పల్లెల ప్రగతి ముందుకు కదలడం లేదు. ప్రాచీన కాలంలో గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది. గ్రామాల్లో పన్నుల వసూల్లు మొదలు అన్ని పనులు గ్రామం నుంచే సాగేవి. కులవృత్తులు నిరాఘాటంగా సాగేవి. వలసలు అన్నవి లేకుండా ఉండేవి. గ్రాదండనాయకుడి ఆధ్వర్యంలో పనులు సాగేవి. రాజులు కావాల్సిన నిధులను విడుదల చేసేవారు. ప్రాచీన కాలం నుండి గ్రామవ్యవస్థ ఏదోరూపంలో మనదేశంలో కొనసాగుతూ వస్తూనే ఉంది. బల్వంత రాయ్ మెహతా అధ్యక్షతన ఈ బృందం భారతదేశంలో అనేక ప్రాంతాలను పర్యటించి సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం 1958లో ఒక నివేదికను సమర్పించింది. గ్రావిూణాభివృద్ధికి నిర్ణయాలు తీసుకునే అధికారం, స్వేచ్ఛ స్థానిక సంస్థలకు ఉండాలని, అవి మూడంచెల విధానంగా ఉంటే బాగుంటుందని తదితర స్పష్టమైన సూచనలు చేసింది. ఆ సూచనల మేరకే దేశంలో మొదట రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో మూడంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. 1978లో అశోక్‌మెహతా కమిటీ చేసిన సూచనల మేరకు 1986లో మండలి ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌ల ఏర్పాటు ఇలా పంచాయితీరాజ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నా యి. 1981లో నియమించిన నర్సింహన్ కమిటీ ఈ అధికార వికేంద్రీ కరణ జరగకపోవడం వల్ల పంచాయితీరాజ్ వ్యవస్థ నామమాత్రంగా మిగిలిపోయిందని తేల్చింది. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీలను క్రియాశీలకం చేయడం, ఏ గ్రామానికి ఆ గ్రామమే ప్రణాళికలు రూపొందించుకొనేలా చేయటం కోసం గ్రామజ్యోతి పథకాన్ని తీసుకుని వస్తున్నట్లు తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించినా ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. నిజానికి సిఎం కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తే ప్రపంచానికి తెలంగాణ ఆదర్శం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల సవిూకృత అభివృద్ధే లక్ష్యంగా 25 వేల కోట్ల రూపాయలతో గ్రామజ్యోతి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన గ్రామాల గతిని మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే అందుకు అనుగుణంగా సంకల్పంతో సాగితేనే ఆశించిన ఫలితాలను చూస్తాం.