పంట రుణాలను సకాలంలో తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు ఫీల్డ్ ఆఫీసర్ సమంతూ
రాయికోడ్ జనం సాక్షి17 రాయికోడ్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రాయికోడ్ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . ఫీల్డ్ ఆఫీసర్ సమంతూ మాట్లాడుతూ రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను సకాలంలో తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు ఇలా ప్రతి సంవత్సరం లోపు రెన్యూవల్ చేయించుకుంటే వడ్డీ తక్కువగా అనగా 7% ఉంటుంది ఒక సంవత్సరం దాటితే 14% వడ్డీ ఉంటుంది అన్నారు. బ్యాంకులో జరిగే లావాదేవీల గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది .రైతులు ఒక సంవత్సరం లోపు రెన్యువల్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన సవివరంగా వివరించారు.అంతేగాక ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ,సురక్ష బీమా యోజన గురించి అవగాహన కల్పించడం జరిగింది .ఆకర్షణీయంగా పెంచినటువంటి డిపాజిట్ వడ్డీరేట్లు ,బంగారు ఆభరణాలపై రుణాలు ,వ్యవసాయ రుణాలు ,గృహ ,విద్యా వికాస్ రుణాల గురించి వివరించారు .అంతేగాక బ్యాంక్ ఆన్ లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ,గ్రామ ప్రజలకు ,తెలియజేశారు .అలాగే ప్రతి రైతు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులొ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు .ఏదైనా ప్రమాదవశాత్తూ ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కుటుంబానికి మేలు చేస్తాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ , ఫీల్డ్ ఆఫీసర్ ఎం ,క్యాషియర్ కృష్ణ ,గ్రామ పంచాయితీ కార్యదర్శి మల్లేశం ,ఉప సర్పంచ్ రాజు , గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శివ కుమార్ ,బ్యాంకు మిత్ర , గ్రామ ప్రజలు ,రైతులు. నాయకులు బాబు రావు అశోక్. n కుమార్. వీరారెడ్డి . పండరి తదితరులు పాల్గొన్నారు .
Attachments area