పగిడిద్ద రాజు ఆలయంలో వాన దేవుని కోసం పూజలు

గంగారం సెప్టెంబర్ 4 (జనం సాక్షి)
గంగారం మండలం పూనుగొండ్ల గ్రామపంచాయతీలో ఉన్నటువంటి పగిడిద్ద రాజు ఆలయంలో వాన దేవుని కోసం అక్కడి మహిళలు సాంప్రదాయ పద్ధతిలో బిందెలతో నీళ్లు తీసుకువచ్చి సమ్మక్క సారక్క గద్దెలకు నీళ్లు తీసుకువచ్చి పోయడం జరిగింది. గత 20 రోజుల నుండి వర్షాలు లేక వేసిన మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు తమ పంటలకు వర్షాలు లేకపోతే మా పంటలు ఎండిపోతాయని వానదేవానికి మొక్కడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి వెనుక సురేందర్ మాట్లాడుతూ మా తాతల తండ్రుల నుండి వర్షాలు పడకపోతే బిందెలతో దేవుని గద్దెలపై నీళ్లు పోసి మొక్కడం మా సాంప్రదాయం అని దీని ద్వారా వర్షాలు పడతాయని మా యొక్క నమ్మకం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు