పట్టణంలో కోతుల బెడద
ఖమ్మం, అక్టోబర్ 30 : ఖమ్మం పట్టణంలో కోతుల బెడద ఎక్కువైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. విధుల్లో తిరిగే చిన్న పిల్లల వద్ద నుంచి పెద్ద వారి వరకు భయభ్రంతులకు గురి చేస్తున్నాయి. ఎవరైనా ఇంటి తలుపులు తెరిచివుంచితే లోనికి ప్రవేశించి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలను పట్టణంలో కోతులు కరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇళ్ళ ఆవరణలో పెంచిన కూరగాయలు, ఇతర చెట్లను ఇష్టామెచ్చినట్లు కొరికి విరగగొడుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులపై కూడా పైకి దూకుతున్నాయి. ఒక్కొక్క సమయంలో రహదారిపై నడవాలంటే భయపడుతున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.