పట్నం వలస బతుకు పల్లెల నుంచి పట్టణాలు, నగరాల దాకా


జానేడు పొట్టను నింపుకోడానికి దూరం కాని దూర ప్రాంతాలకు వలసెల్లి దుర్బరమయిన జీవితం. నిలువ నీడ లేక ఆకలితో అలమటిస్తున్న అభాగ్యజీవులు పట్టణాలు, నగరాలలో బతిక లేక, బతుకు బండి సాగక, తలపించే పల్లే , కూలీల శ్రమ చెమటలతో సుందరాంగి నగర నిర్మాణం అని చెప్పవచ్చు. పచ్చని పల్లెలు అనే మాట ఒకప్పటిడి నేడు పల్లేలు ఎడారులు. పల్లే ప్రేమలు, ఆత్మీయత, ప్రేమానురాగాలు అనుబంధాలు పూర్తిగా తెగిపోయిన వి. మానవ సంబంధాలన్నియు ఆర్థిక సంబంధాలుగానే కొనసాగు తున్నాయి. రాను రాను పల్లేలు కనుమరుగవుతున్నాయి. కరువు కాటకాలు అతివృష్టి, అనావృష్టి రైతులను వెంటాడుతున్నాయి. వ్యవసాయం దండగయింది. భూములు విషపు భూములై తరిమివే స్తున్నాయి. పల్లేలో అంపయ్య, అంపయ్య కుటుంబంమంత మూడు పూటలు తినుకుంటు సల్లంగా బతికేవారు. దొడ్డి నిండా పశువులు, పచ్చని పంటలతో పల్లే కళకళలాడేది. పుట్టకొలది వరి ధాన్యం కూరగాయల పంటలు విపరీతంగా పండించి పట్ణణాలకు ఎగుమ తి చేసేవాడు. అంపయ్య ఆ పల్లేలో మాత్రం ఇరుగుపొరుగు వారి చేత మంచి పేరు తెచ్చుచుకున్నాడు. ఆదర్శ రైతుగా ప్రభుత్వం గుర్తించింది మఖ్యమంత్రి చేతులమీదుగా రైతు అవార్డును తీసుకున్నాడు. పాడి పశువలు ఒకటి నుంచి ఇరవై లీటర్ల వరకు పాలను కేంద్రానికి తరలించి అమ్ముతాడు అంపయ్య చిన్ననాటి నుంచి వ్యవసాయం అంటే మహాఇష్టం మహాప్రేమ. అంపయ్యక తాతా, ముత్తాతల నుంచి వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. కాలమయి పల్లే చెరువులు, కుంటు నిండుగా నిండి పల్లే చుట్టూ పచ్చని పంట పోలాలు పాడి పశువులతో కళకళలాడుతుండేది అంపయ్య కొడుకులు బిడ్డల జీవితాలు గడుస్తున్నాయి, పంటలకు కొదవలేదు. సుఖ సంతోషాతో పల్లే వాసుల జీవితాలు గడుస్తున్నాయి. పంటలకు కొదవలేదు చదువు లకు ఆటంకంలేదు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఇలా పది సంవత్సరాలపాటు జన్మనిచ్చిన పల్లే పొలిమేరల్లో అంపయ్య జీవితాలు కొనసాగినాయి. పది సంవత్సరాల అనంతరం వరస కరువులు నీటి కష్టాలు నకిలీ విత్తనాలతో అంపయ్యకు కష్టాలు మొదలయ్యాయి. పల్లేలో ఉన్న చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కడ చూసిన చుక్క నీళ్లు కానరావు. అంపయ్యకు ఏమి చేయాలో అర్థం కావడంలేదు. ఒకవైపు వ్యవసాయ బావి ఎండిపోయింది. మరోవైపు పంటలు ఎండిపోయినవి. ఇవి చూసిన అంపయ్యయ గుండె గుబుళుమంది. బాధతో కుంగిపోతున్నాడు. ఇంటిలో దాన్యపు గింజలేదు. అంప య్య కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. నెలపై అంబాడుతూ ఏడుస్తు న్నాడు. ఎలా బతుకాలని తనలోతానే ప్రశ్నలు వేసుకుంటున్నాడు. ఆ ఆలోచనల నుంచి ఒక ఆలోచన వచ్చింది. బోరు వేస్తే నీళ్లు పడుతాయయి. మళ్లీ వ్యవసాయం చేయవచ్చునని ఆలోచనకు వచ్చాడు. రాత్రి పడుకున్న ఎంతసేపటికి నిద్ర పట్టదు. ఆలోచించు కుంటూనే పడుకున్నాడు. తెల్లవారెసరికి కోడి కూతలు వినిపిస్తు న్నాయి. కోడి కూతలతో అంపయ్య లేచి కాలకృత్యాలు తీర్చుకుని సమీప పట్టణానికి వచ్చి బోరు బండి యజమానితో 35,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బొరు బండిన తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి బోర్‌ వేయడం ప్రారంభించారు. బోరు ప్రారంభం నుంచి దుమ్ము, ధూళీ వస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలయిన బోరు రాత్రి 8 గంటల వరకు వేస్తూనే ఉంది అయిన బోరులోంచి చుక్కనీరు కూడా కానరాలేదు. ఐదొందల ఫీట్ల వరకు పోయింది అంపయ్య మనసులో అలజడి మొదలయింది. నీళ్లు పడుతాయని ఆశలు పెరిగాయి. ఇంకా లోతుకు వేస్తే నీళ్లు పడుతాయనే ఆవలు వెళ్లువెత్తుతున్నాయి. బోరు పోను పోను వెయ్యి ఫీట్ల వరుకు పోయింది. అయిన చుక్క నీరు రాలేదు. అంపయ్యకు ఆస్థలంలో నీళ్లు లేవని ఆర్థమైపోయింది. బోర్‌ వేయడాన్ని నిలిపి వేశాడు. అప్పటికి బోర్‌ వేసేందుకు అయిన ఖర్చు అక్షరాల యాభైవేల రూపాయలు.అంపయ్య పట్టి పట్టు వదలకుండా మళ్లీ బోర్‌ వేయించాడు. ఈ సారి 1500 ఫీట్ల లోతుకు బోర్‌ వేయించాడు అయినా చుక్క నీరు రాలేదు. మనస్సు గాయమయింది. అంపయ్య కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎన్ని బోర్లు వేసిన చుక్క నీరు రాలేదు. చేసిన అప్పు లక్షలో పెరిగిపోయింది. వడ్డీలు, చక్రవడ్డీలు, బారువడ్డీలు పెరిగిపోయాయి. అప్పుల వాళ్లు వెంటపడడం మొదలు పెట్టారు. ఏం చేయాలో అర్థం కాక అంపయ్య తలపట్టుకున్నాడు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న అంపయ్య ఆరుగాలం కష్టపడి పంటలనుదిగుబడి చేస్తుండు. పంట ధ్యాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తే క్వింటాలుకు 600లరూపాయలు చెల్లిస్తారు. దళారులు చేరమాడుతున్నారు. ఏమి చేయాలో అంపయ్యకు అర్థం కాలేదు చివరకు ఎంతకయినా సరే వరిధాన్యాన్ని అమ్మింది కావాలే. అని ఆలోచించి దళారికి అమ్మాడు. ఆ డబ్బులు చాలడం లేదు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళనకు దిగిన అంపయ్య వీపుపై లాఠీలు నాట్యమాడాయి. శరీరమంతా గాయలైనా గిట్టుబాటు ధర చెల్లిం చలేదు. ఎరువులు, దుక్కి మందు ల ధరలు పెరిగిపోయాయి. నీళ్లు లేక మరో వైపు గిట్టుబాటు ధర లేక అంపయ్య వ్యవసాయయం చివరకు మూలన పడింది. బతుకుతెరువు కోసం అంపయ్య కుటుంబం భార్య, పిల్లలు పల్లేను విడిచి పట్నం దారి పట్టారు. పట్నంలో మురికి వాడలో పూరి గుడిసెను అద్దెకు తీసుకున్నారు. ఆ గుడిసె నెల అద్దె వెయ్యి రూపాయలు. ఆ గుడిసే ముందు డ్రైనేజి కాలువా దాని పక్కన కెమికల్‌ ఫాక్టరీ పొద్దంత ఈగల బాధ రాత్రంత దోమల బెడద. తెల్లవారిందంటే చాలు డ్రైనేజీ మురికి వాసన, తాగుదామంటే నీళ్లు దొరకడం లేదు. ఇంటి నుంచి పట్నానికి వచ్చే ముందు ఇరవై కిలోల కంట్రోల్‌ బియ్యం, కారంపొడి, చింతపండు, నెల రోజుల్లో అయిపోయాయి. అటు ఇటు చూడగానే రోజులు గడుస్తున్నాయి అంపయ్య కొడుకులు చదువుల మానేసి రోజు కూలీ పని కోసం ఎదురుచూస్తున్నారు. అయిన అంపయ్యను, అతని కొడుకులను ఎవరు పనికి పిలవడం లేదు. కూలీ పని దొరకడంలేదు. తిండిలేక పస్తులుంటుంన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు. పూటపూటకు సుడిగండమైన బతుకులు. దొరకక దొరకక ఒకకరోజు మాదవ్‌ తన ఇంటి పనికి అంపయ్యను తీసుకెల్లగా బిల్డింగ్‌పై నుంచి జారి కాలు చేయ్యి నడం విరిగింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజలకు చనిపోయాడు. మాదవ్‌ కొద్దిగా నష్ట పరిహార చెల్లించి చేతులు దులుపుకున్నాడు. కొద్ది రోజులకు బతకలేక పట్నం నుంచి పల్లేకు వచ్చేసారు.
– దామోదర నర్సింహరెడ్డి
9059933253