పదవులకన్నా ప్రజాసేవే ముఖ్యం

3

కేసిఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ చేరిన అజయ్‌, ఫారుఖ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి):

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో అజయ్‌, హుస్సేన్‌  టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిద్దరికి సీఎం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వా నించారు.  పువ్వాడ అజయ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. పార్టీలో ప్రోత్సాహం లేకనే కాంగ్రెస్‌ రాజీ నామా చేస్తున్నట్లు నిన్న ఆయన స్ప ష్టం చేశారు.  మెదక్‌ జిల్లా సిద్ధిపేట పట్టణానికి చెందిన ఫారూఖ్‌ హుస్సే న్‌ కాంగ్రెస్‌లో పలు పార్టీ పదవులను నిర్వహించారు. 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1986-91 మధ్య సిద్ధిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌గా కొనసాగారు. పార్టీ పరంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ పదవులు చేపట్టారు. 2005-07 మధ్య మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలో కొనసా గారు. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ అజయ్‌ చేరికతలో ఖమ్మం మెట్టు బంగారు మెట్టు కావాలన్నారు. పదవు ఉల వస్తాయి పోతాయని, కానీ ఎంతమేరకు ప్రజాసేవ చేసింద న్నదే ముఖ్యమన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరికలు చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసి పని చేద్దామని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావున కులషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. చిన్న పొరపాటు జరిగినా భవిష్యత్‌ తరాలు దెబ్బతింటాయని చెప్పారు. తెలంగాణ నిలిచి గెలవాలన్నారు. ఖమ్మం జిల్లాను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఉద్ఘాటించారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలో ఇంచు భూమి కూడా మిగలకుండా సాగులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాను బాగా తీర్చిదిద్దేలా అందరూ కలిసి పని చేయాలని సూచించారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. పదవులు రాగానే సరిపోదు.. పేరును నిలబెట్టుకోవాలన్నారు. 2016 డిసెంబర్‌ నాటికి తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవుతదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, హరీస్‌ రావు తదితరులుపాల్గొన్నారు.