పదవుల పందెరం!
పది మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం
హైదరాబాద్,ఏప్రిల్ 21(జనంసాక్షి):నామినేటెడ్ పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని 10 మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించింది. మెదక్ జిల్లా ఒంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ గా జహంగీర్, నిజామాబాద్ జిల్లా వర్ని- గంగారాం, బాన్సువాడ- సురేష్ గుప్తా, బీర్కూరు- పెరిక శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కోరుట్ల- నారాయణరెడ్డి, మెట్ పల్లి ?సురేష్, కోటగిరి-శంకర్, ఇబ్రహింపట్నం-కె.లక్ష్మి, మల్లాపూర్ ?శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్సింహారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పోస్టుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.