పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి …..సర్పంచ్ మర్రి
బోనకల్ ,సెప్టెంబర్ 9,( జనం సాక్షి):
ఆళ్లపాడు గ్రామంలో వర్షాకాల సీజన్ వ్యాధులు రాకుండా డెంగ్యూ మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఇంటి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటా నిర్వహించారు. పరిసర ప్రాంతాలను దోమల నిల్వ లేకుండా మురుగు నీరు నిల్వ లేకుండా దోమలు వ్యాప్తి చెందకుండా ఇంటి లోపల ఉన్న రోళ్లు ,కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, నీటి తొట్లు లలో నీరు నిలవ లేకుండా చేసుకోవాలని గ్రామ ప్రజలకు డ్రై డే ఫ్రైడే కార్యక్రమం ద్వారా సూచించారు. డెంగ్యూ దోమల నివారణ చర్యల్లో భాగంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమల బారిన పడకుండా క్రీం సంహారక మందులను స్ప్రే చేసుకుని చిన్నచిన్న రోగాలు రాకుండా కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు ,వెలుగు సిసి లావూరు ఝాన్సీ ,పంచాయతీ కార్యదర్శి పరశురాం, అంగన్వాడీ టీచర్లు పద్మ హుస్సేన్ బీ గౌరమ్మ ఆశా కార్యకర్తలు కళావతి రత్నకుమారి, ఫీల్డ్ అసిస్టెంట్ సైదాబీ, పంచాయతీ సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు