పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. పిడి నాగేశ్వరరావు
గంగారం, సెప్టెంబర్ 7, (జనంసాక్షి)
గంగారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల (ఏ హెచ్ ఎస్) పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిల్లలతో పిడి నాగేశ్వరరావు కలిసి పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి వేస్టేజ్ మొక్కలను, పేపర్లను క్లీనింగ్ చేయించి పిల్లలకు శారీరక శ్రమదార కూడా పిల్లలలో నూతన ఉత్తేజ కలుగుతుందని ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల ఆవరణలో ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని, వర్షాకాలం విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ విద్యార్థులకు పిడి నాగేశ్వరరావు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజుల ప్రణాళికలో భాగంగా ఆశ్రమ పాఠశాలలో చుట్టు పరిసరాల్లో శుభ్రం చేయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగారం మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, హెచ్ఎం శ్రీనివాసు,ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.