పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
…జాల సత్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టర్ జలమండలి
ఎల్ బి నగర్, ఆగస్టు13, (జనం సాక్షి )
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిత్య నగర్ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో సేవ్ ఎర్త్ ఫౌండేషన్, సమతా సేవా సొసైటి సంయుక్తాధ్వర్యములో శ్రావణమాసం రెండవ శనివారం సందర్భంగా భక్తులకు తులసిమొక్కలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా జలమండలి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ విచ్చేసి భక్తులకు తులసి మొక్కలను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సాక్షాత్తు లక్ష్మీ దేవి అమ్మవారు ప్రతిరూపంగా కొలువబడే తులసిలో ఎన్నో ఔషద గుణాలున్నాయన్నారు. తులసి మొక్కలు పంపిణీ చేస్తు, విరివిగా మొక్కలు నాటుతున్న సేవ్ ఎర్త్ ఫౌండేషన్, సమతా సేవా సొసైటీ స్వచ్చంధ సంస్థల ప్రతినిధులను అభినందించినారు.
ఈ కార్యక్రమంలో ఆలయకమిటి చైర్పర్సన్ సంతోషి కుమారి చైర్మెన్ టి మోహన్ రెడ్డి, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సేవా రత్న, పర్యావరణ మిత్ర అవార్డ్స్ గ్రహీత టి సురేందర్, సమత సేవా సొసైటి చైర్మన్ గోనెమోని మంజుకుమార్ ఆలయ ప్రథాన అర్చకులు కొండలాచారి తదితరులు పాల్గొన్నారు.
