పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

3
ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌6(జనంసాక్షి):  పర్యావరణ పరిరక్షణ మన సంస్కృతిలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సమగ్ర విధానం అవసరమని మోదీ అన్నారు. రాష్టాల్ర పర్యావరణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన సోమవారం ప్రసంగించారు. పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తదితరులు పాల్గొన్నారు.  ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణను అలవాటు చేసుకోవాలన్నారు. అప్పుడే కార్యక్రమాలు విపజయవంతం అవుతాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశంలోనే తొలి వాయు స్వచ్ఛతా సూచిని విడుదల చేశారు.  మన జీవన విధానంలో మార్పు వస్తే మిగతావీ మారతాయని, ఆ మార్పు రానంతవరకు ఇతర ప్రయత్నాలన్నీ వృధానేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భూతాపం-కార్బన ఉద్గారాలపై మాట్లాడారు.  ముందుగా 10నగరాల్లోని జాతీయ వాయుకాలుష్య సూచీలను మోదీ ప్రారంభించారు. కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే అతి తక్కువ వాయు కాలుష్యం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం అతితక్కువ కార్బన ఉద్గారాలు విడుదల చేస్తోందని, పర్యావరణ పరిరక్షణలో భారత్‌ కృషిని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. వస్తువుల దుర్వినియోగం అనేది దేశంలో అనాది నుంచి ఉన్నదేనని, వస్తువుల పునర్వినియోగం మన ఇళ్లల్లో సంప్రదాయం వస్తోందన్నారు. భూసేకరణ బిల్లుపై, గిరిజనుల, అటవీ భూముల విషయంలో అసత్య ఆరోపణలకు స్వస్తి పలకాలన్నారు. సౌర, పవన విద్యుత్‌లో ప్రత్యేక చొరవ చూపిస్తున్నామని మోదీ తెలిపారు.  ఇండియా ప్రకృతి కాపాడటంలో ప్రస్తుతం ఓ అవగాహనకు వచ్చిందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  దేశంలోని ప్రముఖ నగరాలైన దిల్లీ, ముంబయి సహా 10 నగరాల్లో వాయుకాలుష్య సూచికల గురించి సమాచారం దీని ద్వారా తెలుస్తుంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. తొలి రోజు పర్యావరణంపై ప్రధానంగా చర్చించనున్నారు. సదస్సులో చర్చల అనంతరం పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మార్చాలని నియమ, నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. మన జీవన విధానంలో మార్పు వస్తే మిగతావీ మారతాయని, ఆ మార్పు రానంతవరకు ఇతర ప్రయత్నాలన్నీ వృధానేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  వస్తువుల దుర్వినియోగం అనేది దేశంలో అనాది నుంచి ఉన్నదేనని, వస్తువుల పునర్వినియోగం మన ఇళ్లల్లో సంప్రదాయం వస్తోందన్నారు. భూసేకరణ బిల్లుపై, గిరిజనుల, అటవీ భూముల విషయంలో అసత్య ఆరోపణలకు స్వస్తి పలకాలన్నారు. హస్తినలోని విజ్ఞాన్‌ భవన్‌లో జాతీయ వాయు కాలుష్య పర్యవేక్షక సూచికలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 10 నగరాల్లోని వాయు కాలుష్య సూచీలను మోడీ ప్రారంభించారు. రెండు రోజుల పాటు అటవీ శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. ఈ సదస్సు ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతోంది. సమావేశానికి రాష్ట్రం తరపున అటవీశాఖ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు.