పాక్‌ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి

1

కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

జైపూర్‌,మార్చి19(ఆర్‌ఎన్‌ఎ):  పాకిస్తాన్‌ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. పాక్‌ తీవ్రవాదులకు సాయం చేసే ప్రక్రియలను ఆపాలన్నారు. ఉగ్రవాదంపై గురువారం జైపూర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ ముస్లింలపై ఐసీఎస్‌ ప్రభావం అతి తక్కువగా ఉందని అన్నారు. సరిహద్దులు లేకుండా ఉగ్రవాదం ప్రపంచ దేశాల్ని వణికిస్తుందని, ఉగ్ర చర్యలను అడ్డుకునేందుకు అన్ని దేశాలు ఒకే పథకంతో ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. విదేశీ ఉగ్రవాదం సవాల్‌గానే ఉందన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భారతీయ యువతపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రభావం అతి తక్కువగా ఉందని, ఇంటలిజెన్స్‌ వర్గాల నివేదిక ప్రకారం మన దేశానికి చెందిన కొద్ది మంది మాత్రమే ఐసిస్‌లో కలిశారని రాజనాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల జోక్యంతో కొందరు మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చేశారని ఆయన వెల్లడించారు. భారతీయ ముస్లింలు జాతి సమగ్రతలో ఏకమైన కారణంగా వారిపై ఐసిస్‌ ప్రభావం అంతగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ ముస్లింలు దేశభక్తులని, తీవ్రవాదానికి దూరంగా ఉంటారని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.