పాఠశాల అభివృద్ధికి లక్ష విరాళం
కొమరోలు , జూలై 13 : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతిగదుల్లో విద్యార్థులు కూర్చునేందుకు డెస్క్‌ల కొనుగోలుకు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి అక్కడికక్కడే పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందచేశారు. ఈ సందర్భంగా ఏడు వేల రూపాయలు గోపాలుని పల్లె కాంట్రాక్టర్ వి కృష్ణమోహన్‌రెడ్డి, స్థానిక తహసీల్దారు చంద్రశేఖర్‌రాజు రూ.1,116 అందచేయగా, ఆ పాఠశాల పూర్వ విద్యార్ధి యాసం అంకన్న వెయ్యి రూపాయలు వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు.