వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు
` ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై మోదీ
` ఎంత పెద్ద సంస్థ అయినా సహించేది లేదు
` ఇండిగోకు కేంద్రం స్ట్రాంగ్ మెసేజ్
` దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తనిఖీలు
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలని.. ప్రజలను వేధించడానికి కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్డీయే పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడిరచారు.‘ప్రభుత్వం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. నియమనిబంధనలు మంచివే. అయితే వ్యవస్థను మెరుగుపర్చేందుకు వాటిని రూపొందించాలి. అవి ప్రజలను వేధించకూడదు’’ అని ప్రధాని మాటలను కేంద్ర మంత్రి గుర్తుచేసుకున్నారు. ‘‘సామాన్య పౌరుల్ని ఇబ్బందిపెట్టే చట్టం, నిబంధన ఉండకూడదని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. చట్టాలు ప్రజలపై భారంగా పరిణమించకూడదు’’ అని వెల్లడిరచారు. వారం రోజులకు పైగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాంతో రోజుకు వందల సంఖ్యలో సర్వీసులు రద్దు, ఆలస్యమవుతున్నాయి. దాంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తూ ఇబ్బందిపడుతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటికీ అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలను కేంద్రం ఇప్పటికే సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారణ కమిటీని వేసింది. ఇక ఈ అవాంతరాలకు ప్రధానంగా ఐదు అంశాలు కారణమని ఇండిగో ప్రాథమికంగా వెల్లడిరచింది. స్వల్ప సాంకేతిక లోపాలు, విమానాల షెడ్యూళ్లను మార్చడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ దీనికి కారణం అని తెలిపింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ఫేజ్ రోస్టరింగ్ నియమాలు కూడా ఒక కారణంగా పేర్కొంది. ఇప్పటికే ఈ కొత్త నియమాలను కేంద్రం తాత్కాలికంగా పక్కనపెట్టిన సంగతి తెలిసిందే.
ఎంత పెద్ద సంస్థ అయినా సహించేది లేదు
ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని పార్లమెంట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని తేల్చిచెప్పారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఆయన లోక్‌సభలో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు ‘‘ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితులు క్రమంగా సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. రిఫండ్, లగేజీని ప్రయాణికులకు చేర్చే చర్యలు కొనసాగుతున్నాయి. డీజీసీఏ ఇప్పటికే ఇండిగో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు కూడా ప్రారంభమైంది. దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా తగిన చర్యలు ఉంటాయి. ఎంతపెద్ద విమానయాన సంస్థ అయినా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు. పౌర విమానయానంలో భద్రత విషయంలో బేరసారాలు లేవు’’ అని మంత్రి వెల్లడిరచారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్..పైలట్ల పని గంటలకు సంబంధించిన ఈ కొత్త నియమాలు ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మంత్రి స్పందిస్తూ.. ఈ సంస్కరణలు ప్రయాణికుల భద్రతను పెంచుతాయన్నారు. పైలట్ల అలసటను దృష్టిలోపెట్టుకొని శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని రూపొందించినట్లు చెప్పారు. ‘‘అన్ని విమానయాన సంస్థలతో చర్చించిన తర్వాతే డీజీసీఏ వీటిని దశలవారీగా అమలుచేస్తోంది. 2025, జులై ఒకటి నుంచి తొలి దశ, నవంబర్ ఒకటి నుంచి రెండో దశను అమలుచేస్తున్నాం. ఈ నిబంధనలను పాటిస్తామని ఇండిగో హామీ ఇచ్చింది.హామీ ఇచ్చినప్పటికీ.. రోస్టరింగ్ నియమాలను అమలుచేయడంలో వైఫల్యమే సర్వీసుల రద్దుకు దారితీసిందని గుర్తించాం’’ అని వెల్లడిరచారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. దానిలోభాగంగా ఈ సర్వీసుల రద్దు వేళ విమాన టికెట్ ఛార్జీలపై పరిమితులు విధించామని గుర్తుచేశారు. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడం లేదని, మరిన్ని విమానయాన సంస్థలను ఇందులోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కొత్త సంస్థలు అడుగుపెట్టడానికి ఇదే సరైన తరుణమని మరోసారి పేర్కొన్నారు.


