పట్టణ సమస్యలు పరిష్కరించండి

పరకాల, డిసెంబర్ 10 (జనం సాక్షి):
పరకాల పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పరకాల పట్టణ కమిటీ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ పరకాల పట్టణంలో ప్రధాన రోడ్లపై, బస్టాండ్ చుట్టుపక్కల పండ్ల బండ్లు ఉండడం వల్ల ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని,పట్టణంలో రెండో వార్డులో రోడ్డు, డ్రైనేజీ లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారనీ కమిషనర్ కు వివరించారు.పట్టణంలో ఉన్న 22 వార్డుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పరకాల పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్, బొజ్జ హేమంత్ పాల్గొన్నారు.


