కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీతో
నే మోరంచపల్లె సంపూర్ణ అభివృద్ధి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నరెడ్ల తిరుపతి రెడ్డి, పరకాల మాజీ మార్కెట్ చైర్మన్ చాడ రఘునాథ్ రెడ్డి లు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో బుధవారం వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సహకారంతో ఇప్పటికే గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, రైతుల అందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్న తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మోరంచవాగు పొంగి ప్రాణనష్టం జరిగితే ఎవరు పట్టించుకోలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిహారం ఇప్పించడం జరిగిందని, సాగునీటి కోసం కాలువ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తాము గెలిచిన వెంటనే గ్రామానికి మరిన్ని నిధులు మంజూరి చేయించి సంపూర్ణ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


