గాడినపడుతున్న ఇండిగో

` సర్వీసులు సాధారణ స్థితికి
` సీఈఓ వీడియో సందేశం
న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని రోజులుగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సర్వీసుల రద్దు మంగళవారం కూడా కొనసాగినప్పటికీ.. కార్యకలాపాలు గాడిన పడుతున్నాయి. ఇదే విషయాన్ని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు ‘‘మీ విమానయాన సంస్థ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అతిపెద్ద కార్యనిర్వాహక వైఫల్యం కారణంగా మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచాం. అందుకు చింతిస్తున్నాం. లక్షలాది వినియోగదారులు వారి రీఫండ్లను పొందారు. ఆ ప్రక్రియను మేం కొనసాగిస్తున్నాం. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన లగేజీని మీ ఇంటివద్దకు చేర్చాం. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాం. నిన్నటి నుంచి వందకుపైగా గమ్యస్థానాలకు మా సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వానికి మా సహకారం అందిస్తున్నాం. అసలు ఈ సమస్యకు గల కారణాలను గుర్తించడంపై ఇప్పటికే దృష్టిపెట్టాం. ’’ అని పీటర్‌ వీడియో సందేశం విడుదల చేశారు