లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి

నూతనకల్ డిసెంబర్ 10 (జనం సాక్షి)
రాళ్లు కర్రలతో దాడులకు దిగిన వైనం
మరో 15 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు రాళ్లతో దాడి చేయడంతో బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య( 55) మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది, స్థానిక సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మృతుడు యొక్క కోడలు టిఆర్ఎస్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా పోటీ చేస్తుంది, కాగా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది, దీంతో రాత్రి తమ పార్టీ కి చెందిన కార్యకర్తలకు డబ్బులు మద్యం పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు, ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు , ప్రతి ఆరోపణలు చేసుకుంటూ తోపులాటలకు దిగారు, ఇరు పార్టీలకు చెందిన నాయకులు వాగ్వాదం చేసుకుంటూ దాడులకు దిగారు, దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు కర్రలతో బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగడంతో బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తలపై కర్రలు, రాళ్లు, ఆయుధాలతో దాడి చేశారు తల పై తగలడంతో తీవ్ర గాయాలే రక్తస్రావం జరిగింది, దీంతో అతడిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు, ఈ దాడుల్లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య తో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వీరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మృతుడికి భార్య ఒక కూతురు కుమారుడు ఉన్నారు, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు

