పాడిపశువుల పోషణతో అదనపు ఆదాయం
శ్రీకాకుళం, జూలై 7 : స్వయం సహాయక సంఘం మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని ప్రతినెలా చెల్లించి ఆర్థికాభివృద్ధి సాధించాలని, పాడి పశువుల పోషణ ద్వారా అదనపు ఆదాయం పొందాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ డయిరీ విభాగం ఎస్‌పిఎం డాక్టర్ నాగేశ్వరమ్మ అన్నారు. గార మండలంలోని అయ్యవారిపేటలో ఇందిరాక్రాంతి పథం ద్వారా మహిళా సంఘాలకు మంజూరు చేసిన డయిరీ యూనిట్‌ను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం బి.వెంకటరావు, ఎపిఎంలు మాధవి, శ్రీనివాసరావు, నిర్మల తదితరులు పాల్గొన్నారు.