పాతతరం విండీస్‌ను గుర్తుకు తెచ్చిన బ్రాత్‌వైట్‌

ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..! పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ ఇప్పుడు విండీస్‌ క్రికెట్‌ కుర్రాకారుకు బాగా సరిపోతుంది. బహుశా ఇంతటి ఉత్కంఠభరిత క్రికెట్‌ మనం చూసి ఉండం. అలాగే ఓడిపోయిందనుకున్న మ్యాన్‌ను మలుపుతిప్పిన తీరు అద్భుతం. నిజంగా ఆదివారం రాత్రి కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్‌లో మ్యాచ్‌ చూస్తున్న వారెవరూ విండీస్‌ గెలుస్తుందని అనుకుని ఉండరు. ఎందుకంటే అంతకు రెండుమూడు ఓవర్లలో రన్‌రేట్‌ పెరిగిందే తప్ప తగ్గలేదు. చివరి ఓవర్‌లో వరుసా నాలుగు సిక్స్‌లు బాదడం అంటే అద్భుతం కాక మరోటి కాదు. అంటే పాతతరం విండీస్‌ టీమ్‌ గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు  లాయిడ్‌, రిచర్డ్స్‌, రిచర్డ్సన్‌, వాల్ష్‌, లారా తదితరులు ఉన్న జట్టు లాగా ఇప్పుడు  విండీస్‌ పటిష్టమైనదిగా ఉందనిపించిది. కోల్‌కతా మ్యాచ్‌ గెలవడం ఒక ఎత్తయితే వీరబాదుడు ప్రదర్వించిన బ్రాత్‌వైట్‌ ఆటతీరు అద్భుతం. నిన్నటి వరు అతను పెద్దగా ఎవరో తెలియదు. కానీ క్రికెట్‌ చరిత్రలో అతనో అద్భుతంగా ఇప్పుడు నిలిచాడు. విండీస్‌కు ఓ సూప్‌ బ్యాట్స్‌మెన్‌ దక్కాడు. సమిష్టిగా రాణించి గెలుపును అందిపుచ్చుకున్నారు. ముంబై వాంఖేడీ స్టేడియంలో టీమిండియాను మట్టి కరిపించి సిక్సర్లు, ఫోర్లు బాది ఫైనల్లోకి దూసుకుని వచ్చాక, ఇంగ్లండ్‌ ముందు ఏం ఆడుతారు లే అనుకున్నారు. ఎందుకంటే న్యూజిలాండ్‌ను ఓడించడంతో ఇంగ్లండ్‌ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ చివరి ఓవర్‌ వరకు ఆధిక్యత ప్రదర్శించిన ఇంగ్లాండ్‌ జట్టు చివరి ఓవర్లో చతికిల పడింది.  కళ్లు చెదిరేలా ఆడి వరుసగా నాలుగు సిక్సర్లు బాది విజయాన్ని విండీస్‌ ముంగిట  నిలిపిన  కార్లోస్‌ బ్రాత్‌వైట్‌  విధ్వసకర బ్యాటింగ్‌ను  ప్రేక్షకులు కోరుకుంటారు. అలాంటి ఆటతీరు కావాలనుకుంటారు. స్టేడియంలో కూర్చున్న వారు షాట్లు కావాలనుకుంటారు. అందుకే ఈడెన్‌ గార్డెన్‌ ఒక్కసారిగా ఉర్రూతలూగింది. టీ ట్వంటీ కప్‌ను మరోమారు వెస్టిండీస్‌ సాధించింది. ప్రేక్షకులయితే బాగా ఎంజాయ్‌ చేశారు. తమకెంతో ప్రియమైన టీ20 క్రికెట్లో రెండోసారి ప్రపంచకప్‌ ఎగరేసుకుపోయింది. 2012లో శ్రీలంకకు షాకిచ్చిన ఆ జట్టు.. ఈసారి ఇంగ్లాండ్‌కు ఝలక్‌ ఇచ్చింది. ఆదివారం అనూహ్య మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. బ్రాత్‌వైట్‌ తన జట్టుకు నమ్మశక్యం కాని విజయాన్నందించాడు బ్రాత్‌వైట్‌ మెరుపులకు ముందు.. ప్రతికూల పరిస్థితుల్లో మార్లోన్‌ శామ్యూల్స్‌ 85 పరుగుల భారీ స్కోరుతో నాటౌట్‌గా నిలిచినా విజేత మాత్రం బ్రాత్‌వైట్‌ అని చెప్పక తప్పదు. ఆఖరి ఘట్టంలో ఆతిథ్య జట్టు భార్‌కు ఉనికి లేకుండా చేసిన వెస్టిండీస్‌, ఈడెన్‌ గార్డెన్స్‌ తుదిపోరులో ధాటిగా రాణించి టి20 విశ్వవిజేతగా ఆవిర్భవించింది. సెవిూస్‌ వరకు ఓటమి అన్నది ఎరుగని న్యూజిలాండ్‌ను కంగు తినిపించి అనూహ్యంగా ఫైనల్స్‌కి అర్హత సాధించిన ఇంగ్లాండ్‌ జట్టు, కరీబియన్ల దూకుడు ముందు బోర్లాపడక తప్పలేదు. నిజంగా విండీస్‌ జట్టు ఒకప్పుడు అభేద్యంగా ఉండేది. అలనాటి ఆటతీరును ప్రస్తుత జట్టు మరోమారు రుజువు చేసుకుంది. ఒకిని మించి ఒకరు రాణించడం అన్నది విండీస్‌ జట్టు ప్రత్యేకత. అది మళ్లీ ఈ జట్టులో కనిపించింది. కార్లోస్‌ బ్రాత్‌వైట్‌.. వెస్టిండీస్‌ జట్టులో ఇంతటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ అని ఎవరూ ఊహించి ఉండరు. అతడి ఆట ఎలా ఉంటుందో తెలియదు.. టీ ట్వంటీలో ఆడుతున్నా  అతడిపై ఎవ్వరూ దృష్టిపెట్టలేదు.. కానీ ఈ డెన్‌ వేదికగా  నాలుగే షాట్లతో.. అతను సూపర్‌ హీరో అయిపోయాడు! ఆ నాలుగు నిమిషాల్లో అతను అద్భుతాలే చేశాడు.. ఆ నాలుగు షాట్లు క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనలే సృష్టించాయి.  6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన సమయంలో విండీస్‌ ఓటమి ఖాయం అయ్యిందనుకున్న దశలో ఇంగ్లండ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. అనుభవజ్ఞుడైన బౌటర్‌ స్టోక్స్‌ బౌలింగ్‌కు దిగాడు. ఒక్క బాల్‌ వేస్టయినా అంతే సంగతులు. అప్పటికే 85 పరుగులు చేసిన శామ్యూల్స్‌ అవతలి వైపున్నాడు.. క్రీజులో ఉన్నదేమో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాత్‌వైట్‌! కరీబియన్ల ముఖాలు వాడిపోయి ఉన్నాయి.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ముఖాల్లో కప్పు గెలిచేసినంత సంబరం కనిపిస్తోంది. వెస్టిండీస్‌కే మద్దతుగా ఉన్న ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియంలో కూడా పెద్దగా సందడి లేదు. ఇక ఈ ఓవర్‌ ముగిస్తే కప్పు ఇంగ్‌ండ్‌ వశం అవుఉతందని అంతా ఊపిరి బిగబట్టుకుని అద్భుతాలు జరగవులే అనుకుని చూస్తున్నారు.  కానీ అద్భుతమే జరిగింది. తొలి బంతిని సికస్ర్‌ బాదడంతో ఆశలు నిలిపాడు. మళ్లీ సబమరో సిక్సర్‌..మూడో బాలుకు మరో సిక్సర్‌..ఇంకేముందు విజయం విండీస్‌ సొంతమయ్యింది. స్కోరు సమమయ్యింది. మరో మూడు బాళ్లలో ఒక్క పరుగు చేయాల్సి ఉంది. ఇక సింగిల్‌ తీస్‌ఆడనుకున్న తరుణంలో బ్రాత్‌వైట్‌ తన దూకుడు తగ్గించకుండా మరో సిక్సర్‌ బాదాడు. అంతే కరీబియన్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాలుగో సిక్సర్‌తో ప్రపంచ కప్పు విండీస్‌ సొంతమైంది. నిజం/-గా స్టేడియంలో ఉన్నప్రేక్షకులకన్నా టీవీల ఉందు అతుక్కుని పోయిన ప్రేక్షకుల ఈ మ్యాచ్‌ను బాగా ఎంజాయ్‌ చేశారు. టీమిండియా ఓటమి పాలైనా కప్పు విండీస్‌కు దక్కడంతో ఆనందంగా ఉన్నారు.  టీ ట్వంటీ అంటేనే సిక్సర్లు..బౌలర్‌ ఎంతటి కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసినా దానిని బాది ఫోర్లు సిక్స్‌లు కొడితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈడెన్‌ గార్డెన్‌లో టిక్కెట్లు కొని కూర్చున్న ప్రేక్షకులు ఈ ఆనందాన్ని పొందారు.