పాదాలు కడిగి ముద్దాడిన పోప్‌

2

వాటికన్‌ సిటీ మార్చి25 (జనంసాక్షి):

ఈస్టర్‌ సందర్భంగా క్రైస్త్రవ పీఠాధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌  అసాధారణమైన ప్రేమను పంచి పెట్టారు. రోమ్‌ లో గురువారం  నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది కాళ్లు కడిగి తన నిరాడంబరతను, ప్రేమను ప్రదర్శించారు. ఈస్టర్‌ సంప్రదాయానికి గాను ఎంపిక చేసిన 11 మందిలో ఒక భారతీయ హిందువుతో పాటు నలుగురు నైజీరియన్‌ క్యాథలిక్కులు – ముగ్గురు ఎరిత్రియా మహిళలు – మాలీ – పాకిస్థాన్‌ – సిరియాలకు చెందిన ముగ్గురు ముస్లింల పాదాలు  కడిగి,  ముద్దాడారు.ఈస్టర్‌ సండేకు సిద్ధమవుతున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయంగా వివిధ మతాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయంకల్పించే ప్రక్రియలో భాగంగా…11 మంది యువ శరణార్థులు వలస కేంద్రంలో పనిచేసే ఓ ఇటాలియన్‌ పాదాలను పోప్‌ శుభ్రం చేశారు. వారి పాదాలకు నీళ్లు పోసి కడిగి తువ్వాలుతో తుడిచి పోప్‌ ముద్దు పెట్టుకున్నారు. దాన్ని సోదర స్పర్శగా అభివర్ణించారు. అటు గుడ్‌ ఫ్రైడే సందర్భంగా  శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించారు.కాగా యేసుక్రీస్తు గుడ్‌ఫ్రైడే రోజున సిలువ వేయబడటానికి ముందురోజు తన శిష్యుల కాళ్లు కడిగినట్టు పోప్‌ ప్రతిఏటా 12 మంది కాళ్లు కడగటం  ఆనవాయితీగా వస్తోంది.ఫ్రాన్సిస్‌కు ముందున్న పోప్‌లు కేవలం క్యాథలిక్కుల కాళ్లు మాత్రమా కడిగేవారు. కానీ పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆ సాంప్రదాయాన్ని మార్చారు.  2013లో పోప్‌ పదవిని చేపట్టిన తరువాత ఫ్రాన్సిస్‌… స్త్రీలను, అన్యమతస్తులను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకుని పలువురిని ఆశ్చర్యపరిచారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో కూడా శరణార్థులను, ఆఫ్రికన్‌లను, ముస్లింలను, స్త్రీలను, ఒక హిందువును కూడా చేర్చడం విశేషంగా మారింది.  మనందరి మతాలు, సంప్రదాయాలు వేరు కావచ్చు. కానీ మనమంతా సోదరులం. శాంతిని కోరుకునేవారం అంటూ తన సందేశాన్ని వినిపించారు పోప్‌!