పార్లమెంటరీ సెక్రటరీల అధికారాలపై త్వరలో స్పష్టత

5

10 నెలల పాలనపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): పార్లమెంటరీ సెక్రటరీల బాధ్యతలపై త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు పాలనపై మంత్రులు పట్టు సాధించాలని ఆయన సూచించారు. 10 నెలల పాలన పూర్తైన సందర్భంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ముఖ్యనేతలతో కేసీఆర్‌ బుధవారం సమావేశమయ్యారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల లోటుపాట్లపై ఆయన చర్చించినట్టు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ.. ప్రభుత్వం, పార్టీ వ్యూహంపై కూడా చర్చించినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఈ నెలాఖరున నిర్వహించాల్సిన బహిరంగ సభపై సమాలోచనలు జరిపారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఈ భేటీలో చర్చించారు.