పార్లమెంట్‌ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం

6

న్యూదిల్లీ మార్చి 22 (జనంసాక్షి):

పార్లమెంటు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సందర్శకుల ప్రవేశద్వారం వద్ద విద్యుదాఘాతంతో ఏసీ ప్లాంట్‌లో మంటలు భారీగా చెలరేగాయి. మంటలతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఏడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో పార్లమెంట్‌కు వచ్చే పలు దారులను భద్రతా దళాలు మూసివేశాయి.

అగ్నిప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత పార్లమెంటు భద్రత విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటుకేది భద్రత.. తనిఖీల సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  పార్లమెంటు ఆవరణలో అంత పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడం తనకు తీవ్ర ఆందోళన కలిగించిందని, ఇలాంటి ఘటన జరగడం పార్లమెంటు ఆవరణలో ఉన్న భద్రతను ప్రశ్నించేలా చేస్తుందని అన్నారు.

ఆదివారం మధ్యాహ్నం తర్వాత పార్లమెంటు ఆవరణలోని రిసెప్షన్‌కు సవిూపంలోగల పవర్‌ స్టేషన్‌కు చెందిన ఏసీ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం సంభవించిందిజ. ఈ ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. కానీ భారీ స్థాయిలో అరగంటపాటు మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

చివరికి పన్నెండు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. దీనిపైనే రాష్ట్రపతి స్పందిస్తూ ఇక నుంచి ప్రతి క్షణం పార్లమెంటు ఆవరణం పకడ్బందీ రక్షణతో ఉండాలని, అణువణువు ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తుండాలని ఆదేశించారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలను శోధించి మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని పార్లమెంటు సిబ్బందికి చెప్పారు.