పాలకుల దుర్మార్గానికి వేల ప్రాణాలు బలి
ఉత్తరాఖండ్ జూన్ రెండవ వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల గంగ ఉప నదులైన భాగీరథి, అలకనంద, మందాకిని వంటి నదులకు పెద్దఎత్తున వరుదలు వచ్చాయి. కొండచరియలు విరిగిప డ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు వరదకు కిందికి దొర్లుతూ వచ్చాయి. బురదనీరు వెల్లువలా ప్రవహించింది. రహదార్లు ధ్వంసమై పోయాయి. ఈ ప్రాంతంలో చార్‌ధామ్ పేరుతో సుప్రసిద్దమైన కేదార్‌నాథ్, బదరినాథ్, గంగోత్రి, యమునోత్రి అనే నాలుగు హిం దూ పుణ్యస్థలాల యాత్రలకు వెళ్లిన వేలాది మంది యాత్రికులు, ఆ ప్రాంతంలో వున్న స్థానికులు, వ్యాపారస్థులు ప్రాణాలు కోల్పో యారు. ఊళ్ళకు ఊళ్ళు కోట్టుకపోయాయి. కేదారినాథ్ పట్టణం పూర్తిగా శిథిలమైపోయింది. గౌరికుండ్, రామ్‌బడ, సోన్ ప్రయాగ వంటి వ్యాపారస్థలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్నో బహుళ అంతస్థుల భవనాలు పేకమేడల్లా కూలిపోయి వరదలో కొట్టుకుపోయాయి.ఈ బీభత్సం జరిగి జూన్ 15-16 నుంచి ప్రచార సాధనాలతో చాల వివరాలు వెలువడుతున్నాయి గాని దీన్ని ప్రకృతి విలయం అనో మానవ కల్పితం అనో మాత్రమే అభివర్ణిస్తున్నాయి. దీనిలో ప్రకృతి విలయం అనే అంశం ఉన్నమాట నిజమే. ఆ ఒక్కరోజునే సాధరణ వర్షపాతం కన్నా ముపైరెట్లు, వందరెట్లు కూడ నమోదయింది. ఒకుమ్మడిగా వచ్చిన వరుద తో సరసుల గట్లు తెగిపోవటంతో కొండల మీది నుంచి నీళ్ళు పరవళ్ళు తొక్కుతూ కిందికి దూకా యి. గతంలో అదే రోజున ఎంత వర్షం కురిస ిందనే దానితో పోల్చి చూసినప్పుడు జూన్ 16న కురిసిన వర్షం ఎక్కువ కుడా కావచ్చు. కాని హిమలయాలలో సాధారణంగానే వర్షపాతం ఎక్కువ. హిమాలయాల నుంచి ప్రవహించే నదుల న్నిటిలోనూ నీటి పరిమాణము ఎక్కువే. అయిన ఇంతకన్నా ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు కూడ గతంలో ఎన్నడూ ఇంత విలయం జరిగిన దాఖాలాలు లేవు. కనుక ఈసారి విలయానికి ప్రకృతితో పాటుగా, ప్రకృతికన్న ఎక్కువగా కారణాలు ఉండి ఉండాలి.ప్రకృతి ఏకైక కారణమో, ప్రధాన కారణమో కాదని అనేవాళ్ళు చాలమంది ఇది మానవ కల్పితం అంటూ అంటారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ విలయానికి కూడ ఇటువంటి వివరణలు వస్తున్నాయి. నిజానికి ప్రస్తుత భీభత్సం లోనైతే మానవ అనిర్ధిష్టంగా ఎవరో తెలియని అనామకుల మీద నెపం పెట్టడానికి కూడ విలులేదు. ఉత్తరాఖండ్ భీభత్సానికి కార ణం మనిషి అనే అనామకజివి కాదు. చాలా స్పష్టంగా, ఉద్దేశ పూర్వకంగా పాలకవర్గ కుటిలనితి, అవినీతి, ప్రపంచీకరణ విధానా లు కారణం. పాలకులు దశాబ్దాలుగా అనుసరిస్తున్న ప్రకృతి వ్యతి రేక, ప్రజావ్యతిరేక అక్రమ విధానాలు ఇవాల్టి స్థితికి దారి తీశాయి.ఈ పాలక విధానాలలో ప్రధానమైనది ఇతోధికంగా జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలనే దురాశ. ఉత్తరాఖండ్‌లో ప్రవహించే నదులపై 25000 మెగవాట్ల స్థాపిత సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మించవచ్చునని, ఇప్పటికి అందులో ఆరువేల మెగావాట్ల కేంద్రాలు మాత్రమే ఎర్పాటయ్యాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంటున్నది. ఆ నదుల మీద కొత్త విద్యుత్ కెంద్రాలు ఏర్పాటు చేయదలుచుకున్న పెట్టుబడిదారులకు సకల సౌకర్యలు కల్పిస్తామని ఎర్ర తీవాచిలు పరిచి ఆహ్వనిస్తున్నది. మైక్రో (వంద కిలోవాట్లు లోపు), మిని(వంద కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు) స్మాల్ (రెండు మెగావాట్ల నుంచి 25మెగావాట్ల వరకు) విద్యుదుత్పత్తి కేంద్రాలు వందలు ఏర్పాటయ్యాయి, లేదా ఏర్పాటయ్యే దిశలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటికన్నా పెద్దవి, డెబ్భై గావాట్ల నుంచి వెయ్యి మెగావాట్లదాక సామర్థ్యం ఉన్నవి విద్యుదుత్పత్తి కేంద్రాలు దాదాపు డెబైదాకా వున్నాయి. మొత్తంగా ఉత్తరాఖండ్‌లో 600 జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 90 శాతం గత 12సంవత్సరాలలో రాష్ట్రం ఏర్పడిన తరువాతనే నెలకొల్పారని పర్యావరణ వేత్తలు అంటున్నారు.ఇంతకు కోటి మాత్రమే జనాభ వున్న ఉత్తరాఖండ్‌కు అంత విద్యూత్ అవసరాలు లేవు. తమ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తునంతా ఉపయోగించుకునే పారిశ్రామిక, గృహ అవసరాలు ఉత్తరాఖండ్‌లో లేవు. కాని ఢిల్లికి పోరుగు రాష్ట్రాలకు అమ్మడం కోసమే విద్యుత్ తయారుచేయడానికి ఉత్తరాఖాండ్ ప్రభుత్వం తన నదులను ప్రైవేటు పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్నది. ఈ విధానాన్ని పోరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ప్రోత్సహిస్తున్నాయి. జివికే, జిఎంఆర్, లాంకో, వంటి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంస్థలూ, ఎల్ అండ్ టి వంటి బహుళజాతి సంస్థలూ, ఉత్తరాఖాండ్ జలవిద్యుత్ నిగమ్ వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఈ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి, చేస్తున్నాయి. ఈ జల విద్యుత్ కేంద్రాల నిర్యాణంలో నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని, జరుగుతున్నాయని కాగ్ నివేదికలు, ప్రత్యేకంగా నియమించిన బికె చతుర్వెది కమిటీి నివేదిక స్పష్టం చేశాయి. ఉత్తరాఖాండ్ రాష్ట్రం 2000లో ఏర్పడితే గడిచిన పనెండు సంవత్సరాలలో ఏడుగురు ముఖ్యమంత్రులు మారారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏడు సంవత్సరాలు సాగగా ఆరుగురు ముఖ్యమంత్రులు పాలించారు. ఇలా ఆస్థిర ప్రభుత్వాల వల్ల, పదవీకాలం తక్కువగా ఉన్నందువల్ల, మంత్రులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, ఇష్టారాజ్యంగా అనుమతులు జారి చేశారు. ఆ అక్రమాల వల్ల తామరతంపరగా పుట్టుకోచ్చిన జల విద్యుత్ కేంద్రాల వల్ల ఉత్తరాఖాండ్‌లో నదుల మీద కనీసం మూడు వందల కొత్త ఆనకట్టలు కట్టవలసి వచ్చింది. అలా సదుల సహజ గమనం మీద ఆటంకాలు ఏర్పాడ్డాయి. అలాగే విద్యుత్ కేంద్రాల కోసం లోతుగా తవ్వకాలు, భారీ నిర్యాణాలు, అడవి నరికివేతలు ఇబ్బడిముబ్బడిగా జరిగాయి. జల విద్యుత్ పాటే సాగించి ఖనిజ వనరుల తవ్వకాలు , ఒకవైపు ప్రంచీకరణ విధానాల ‘అభివృద్ధి’ సమూనా, మరోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడినా తర్వాత అభివృద్ది పరగులో ఇతర రాష్ట్రాలతో పోటీ కలిసి ఉత్తరాఖండ్:లో అటు భాతతీయ జనాత పార్టీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం విపరీ తంగా ఖనిజ తవ్వకాలకు అనుమతులచ్చాయి. హిమాలయ పర్వత శ్రేణి గర్భ సంపన్నమైన ఖనిజ వనరులకు నిలయం. అక్కడ గోలమైట్ ,సున్నపురాయి, మాగ్నెసైట్, నాపరాళ్ల, సుద్దరాళ్లు, సీసం, జింక్, రాగి, బంగారం, టంగ్‌స్టన్, అంటమెని వంటి ఎన్నో ఖనిజా లవణాలు ఉన్నాయి.ఇప్పటికి కనిపెట్టిన నిక్షేపాలు తక్కువే, కాని పారిశ్రామికీకరణ పరుగులో వాటి తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్నుపురాయి గనుల తవ్వకంలో సున్నితమైన హిమాలయ పర్వత ప్రాంతం ఒకవైపు భూకంపాలకు నిలయంగా మారి పోయింది. మరోవైపు అడువుల నిర్మూలన విప్తారంగా సాగిపోయింది. హిమాలయ పర్వత సానువులో, అతి ఎక్కవ వర్షపాలం, నాత&ం ప్రవహించే నదులతో ఈ ప్రాంతం వేల సంవత్సరాతు దట్టమైన సహజాణ్యాలకు నిలయంగా ఉండేది. బ్రిటిష్ పాలనాకాలంలో పరిశ్రామలకు, రైల్వేలకు కలప అవపరాల కోసం ఇక్కడ అడువులను సరకడం ప్రారంభమయింది. అవే విధానాలు 1947 తర్వాత కూడా కొనసాగయి. పందోమ్మిదో శలాబ్దాం నుంచి ఇక్కడ అడవి నిర్మూలన ఎలా పథకం ప్రకారం జరుగుతున్నదో, అది మొత్తంగా గంగా మైదాన పర్యావరణాన్ని ఎలా దెబ్బతీయనున్నదో పర్యావరణ పరిశోధకులు ఇప్పటికే వివరించారు. తమ జీవనాధారమైన అడవిని ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు ఇలా నిర్మూలించడానికి వీలు లేదని, 1970లలో చెట్లను కాపాడుకోవడానికి సాగిన చిప్కో ఉద్యమం కూడా ఇక్కడే ప్రారంభంమైంది. కాని గత ఒకటి రెండు దశాబ్దాలలో అటు సున్నపు రాయి గనుల కోసము, ఇటు కలప అవసరాల కోసము, పర్యాటక అవసరాల కోసము అడవుల సరికివేత విపరితంగా జరిగిపోతున్నది. ఉత్తరా ఖండ్ ప్రకృతి సౌందర్యనికి పిలయం గనుకా, హిందు వులు పవిత్రంగా భావించే ప్రదేశాలు ఉన్నందువల్ల ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా పర్యాటక రంగం విస్తృతం గానే ఉంది. అయితే ఇటివల కాలంలో దేశంలో పెరిగి పోతున్న హిందూ మతోన్మాదంతో భక్తి, హిందూ పుణ్యస్థ లాల పర్యటన విచ్చలవిడిగా పెరిగిపోయాయి. చార్‌ధామ్ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్ అసలు చార్‌ధాయ్ కాదు. దేశం నలుమూలల ఉన్న ద్వారాక, బద్రీనాథ్, సూరీ, రామశ్వేరంలను చార్‌ధామ్ అంటారు. కాని చోటా చార్‌ధామ్ పేరుతో ఉత్తరాఖండ్‌లోని నాలుగు పుణ్యస్థలాలకు ప్రాధాన్యత కల్పించడంలో సంఘపరివార్ పాత్ర ఉంది. ని జంగా ఆస్తికులైనా ప్రతిచోటా భగవంతుడు ఉన్నాడని అనుకోవాలి. గాని కొన్ని స్థలాలకే ప్రత్యేకత, ప్రాధాన్యత కలిపించడం భక్తిని వ్యాపార, రాజకీయ ప్రయోజనాలుగా మార్చుకునేటందుకే. ఈ పర్యాటక రంగ అభివృద్ది ఉత్తరాఖండ్‌లో మారుమూలల్లోకూడా రిసర్ఠులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్‌లు, పార్కింగ్ లాట్లు, టూర్ ఆపరేటర్లు వ్యవస్థ ఏర్పండింది. కొండల అంచుల్లో,అడువులు నరికి రహదారల నిర్మాణం జరిగిపోచింది. చాల సందర్భాలలో ఈ భవన నిర్మాణాలు నదుల ఒడ్డున, నదుల గర్భాలలో కూడా జరిగయి. ఆక్కడి ఆహ్లాదకర వారవరణం వల్ల దేశంలో సంపన్నులు కూడ అక్కడ తమ విలాస గృహలు నిర్మించుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయి అటవీ భూమిని, వ్యవసాయ భూమినీ వ్యవసాయేతర అవసరాలకు, భవన నిర్మాణానికి వాడడం మొదలయింది. గతంలో నీటి ప్రవాహాలు ఉండిన ప్రాంతాలలో భవానాలు నిర్మించి ఆ ప్రవాహాలను అడ్డుకోవాడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా హిమాలయ పర్వత పాద ప్రాంతంలోని పర్యావరణపు సున్నితత్వాన్ని ధ్వంసం చేశాయి. ఆ ప్రాంతం మీద మూకుమ్మడిగా, దుర్మార్గంగా దాడి చేశాయి. లక్షల ఏళ్లుగా సురక్షాతంగా ఉన్న జీవవారణాన్ని ఒక&ంక తరంలో అతలాకులలం చేశాయి. ఈ అన్ని కార్యక్రమాలను ‘మానవ కల్పితం’ అనే మాటతో పిలవడం తప్పు. ఇవన్నీకూడా పాలకవర్గ పలితాలే. పెట్టుబడిదారుల లాభాపెక్ష పలితాలే. హిందూ మతోన్మాధ పలితాలే. సంపన్నుల విలాసాకాంక్ష పలితాలే. ప్రస్తుత బీభత్సంలో అలోచించవలసిన అంశం మరోకటుంది. రెండు శక్తి స్థలాలు (గంగోత్రి, యమునోత్రి), ఒక శైవ క్షేత్రం (కేదార్‌నాథ్), ఒక విష్ణు క్షేత్రం (బద్రీనాథ్)లతో కలిసిన చోట చార్‌ధామ్ హిందూ మతంలోని ప్రధాన పాయలన్నింలికి కేంద్రం. అక్కడికి ఏటా జూన్, జులై మాసాల్లో రెండు, మూడు లక్షల మంది వేళ్తుంటారు. ఈ సారి జూన్‌లో అలా వెళ్లిన లక్ష మంది యాత్రికుల్లో పదివేల మంది మృత్యువాత పడి ఉంటారని ప్రస్త్తుత అంచనాలు తెలుపుతున్నయి. భగవంతుడు ఉంటే గింటే ఒక్కుమ్మడిగా ఇంతమంది ప్రాణాలను ఎందుకు తీశాడో, తన ఆలయాలనూ, తన భక్తులనూ కూడా ఎందుకు రక్షించుకోలేకపోయాడో భక్తులు ఇప్పటికైనా ఆలోచిం చాలి. భగవంతుడి మీద భారం వేసి, భగవచ్చేదన వల్లనే ఇన్ని ఇబ్బందులు పడ్డామని అనుకునే భక్తులు విధ్వంసానంతర రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం వైపు చూస్తూన్నారు. ప్రభుత్వం తగిన రక్షణ సౌకర్యాలు, పునరావాస, భద్రతా సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ప్రజల జీవన భద్రతను పరిరక్షించవలసిన బాద్యత ప్రభుత్వానిదే అనడంలో సందేహం లేదు. కాని ప్రస్తుత పాలకవర్గాల ప్రభుత్వం నుంచి అది ఆశించడం అత్యాశే. ఆసలు ముందు జీవన విధ్వంస విధానాలను విధ్వంసం నుంచి రక్షిస్తారని, సహాయం అందిస్తారని కూడ ఆశించలేం. మొత్తం మీద పదివేల మంది ప్రాణాల బలితో పాలకవర్గాల స్వభావం మరోసారి రుజువైంది.
– రాజవరం పార్థసారథి