పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా తుమ్మల
హైదరాబాద్,ఏప్రిల్ 20(జనంసాక్షి):ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపేందుకు తెరాస అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సునాయాసంగా గెలిచే అవకాశం దృష్ట్యా పోటీచేయాలని తెరాస నిర్ణయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావే సరైన అభ్యర్థి అని కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ స్థానానికి మే 16న ఎన్నిక నిర్వహించనున్నారు.