పావు
(గత బుధవారం తరువాయి భాగం)
ఆయా లోపలికి వచ్చింది. గుర్తు పట్టి నమస్కారం చేసింది.
”డాక్టర్ కోసం వెళ్ళాలా ?” సిస్టర్‌ని అడిగింది ఆయా.
”అక్కర్లేదు, పోలీస్ వెళ్ళాడు” జవాబు చెప్పింది సిస్టర్.
రూం ఎదురుగా ఉన్న వరండాలో కూడా రెండు బెడ్స్ వేసారు. జనాభాకి తగ్గట్టు ఆసుపత్రులు లేవు. గోడలు పెచ్చులూడిపోయి కాలి మానినగాయాల్లా ఉన్నాఇ. మూత్రాలు మందులు కలగలిసిన ఆదోరకం వాసన.
పది నిముషాల తరువాత పీజీని తీసుకుని హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు. సిస్టర్, పీజీ, నేనూ కలిసి వరండాపక్కన ఉన్న హాల్లోకి వెళ్లాం. హెడ్ కానిస్టేబుల్ని బయటే నిల్చోమని చెప్పాను. కాగితాలూ, ప్యాడూ రిక్విజిషన్ అతీణ్ణుంచి తీసుకొన్నాను.
మంచాల నిండా పేషంట్లు, క్షతగాత్రులతో నిండి ఉన్న యుద్దరంగంలా ఉంది. ఆ హాలు. కొందరు మూలుగుతున్నారు. కొందరునిద్రలో ఉన్నారు. ఫ్యాన్లు రెండు తిరగలేక తిరుగుతున్నాయి. పేషంట్ దగ్గరికి వెళ్లాము.
బంటి నిండా కాలిన గాయాలతో ఆమె. మాంసం మాడి కమురు వాసన. వెంట్రుకలు కాలిన వాసన. టైరు కాలిన వాసన. ముఖం నల్లగా భయంకరంగాఉంది. కళ్లు సంగం మూసి ఉన్నాయి. శరీరం నిండా రక్తగాయమాఉల. పెచ్చులూడ్తున్న వంటింటి గోడల్లాగా ఆమె శరీరం మీద చర్మం ఊడిపోతుంది.
ఎంత కష్టంగా ఉంటుందోఒ. తల్లడిల్లిపోయింది మనసు. ఎంత భయంకరమైందీ చావు. ఆమె పక్కన ఓ వ్యక్తి ఉన్నాడు9. ఆమె భర్తేనేమో. బయటకి పంపించాను. ఆమె సంబంధీకులు ఎవరూ లేరు.
డాక్టర్ ఆమెని పిలిచాడు. పలుకరించాడు. ఆమె స్పృహలో ఉందని, ఆమె మానసిక పరిస్థితి బాగానేఉ ఉందని సర్టిఫై చేశాడు. ఆమె దగ్గరిగా వెళ్లాను.ఆయా కుర్చీ తెస్తుంటే వద్దని వారించాను. నిల్చోని నమోదు చేయడమే అలవాటు.
”నేను కోర్టు నుంచి వచ్చాను. మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్‌ని. నీకు గాయాలు ఎలా ఆయ్యాయో తెలుసుకొందామనీ, నీ స్టేట్‌మెంట్ నమోదు చేసుకోవడానికి వచ్చాను. అర్థమైందా?” అన్నాను.
అర్థమైందన్నాట్టుగా తలూపింది. అదే రాసుకొన్నాను.
”ఏం పేరమ్మా”
”రజిత”
”పెళ్లయిందా?”
”అయింది”
”దాహం వేస్తూంది.మంచినీళ్లు కావాలి”
”ఇస్తారు. నేను అడిగేవాటికి సమాధానాలు చెప్పు. మంచినీళ్లు, మందులు అన్నీ ఇస్తారు”
”నీళ్లిస్తేనే చెబుతాను. దాహంగా ఉంది”
నర్స్‌వైపు చూశాను. గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఆమె నోట్లో పోసింది. ఎక్కువగా తాగితే వాంతవుతుంది.
”నీ భర్త పేరేమిటి?”
”నేను బతుకుతానంటారా?”
ఒక్క క్షణం ఆగాను. ఆలోచించాను.
”ఫర్వాలేదమ్మా. డాక్టర్లున&ఆనరు. ఇది అయిపోగానే మందులిస్తారు. మీ భర్త పేరేమిటమ్మా”
”కరుణాకర్”
”ఎంతవరకు చదువుకున్నావు?”
”ఇంటర్మీడియట్”
”ఎక్కడుంటారు?”
”మారేడ్‌పల్లి”
”పల్లలున్నారా?”
”పాప, బాబు”
”ఈమె ఎవరో తెలుసా?” నర్సుని చూపిస్తూ అడిగాను.
”సిస్టర్”
”ఇప్పుడు మీరెక్కడున్నారో తెలుసా?”
”హస్పిటల్లో ఉన్నాను”
ఆమె మానసిక పరిస్థితి సంతృప్తికరంగా అన్పించింది. సర్టిఫై చేశాను.
”ఈ గాయాలు ఎలా అయ్యాయి ?”
”సాయంత్రం వంట వండుతుంటే నా నైలక్సు చీర అంటుకొని కాలింది”
”కిరోసిన్ వాసనోస్తోంది ఆమె దగ్గర.
”చూడమ్మా ! నిజం చెప్పాలి. ఇప్పుడు మీరు ఏది చెబితే అదే నిజమవుతుంది”
”నిజము చెప్తున్నాను”
”బయటికి వెళ్లాడే అతనెవరు?”
”నాభర్త”
”ఎన్ని గంటలకి జరిగింది ?”
”ఏడు గంటల ప్రాంతంలో”
”ఎక్కడ జరిగింది”
”మా ఇంట్లోనే”
”ఎవరున్నారు అపుడు ఇంట్లో ?”
”పిల్లలూ, భర్త”
”తరువాత ఏం జరిగింది ?”
”అరిచాను. మా ఆయన పరుగెత్తుకొచ్చారు. ఆర్పినారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చినారు”
”ఇంకా ఏమైనా చెబుతావా?”
”ఏమీ లేదు”
నేను రాసుకొన్నది ఆమెకి చదివి విన్పించాను. ఆమె సంతకం తీసుకొమ్మని సిస్టర్‌కి చెప్పాను. అతి కష్టంగా వంకరటింకరగా సంతకం చేసింది.
అక్కడి నుంచి సిస్టర్ రూంకి వచ్చాము. డాక్టర్ సర్టిఫై చేసి వెళ్లిపోయాడు. ఇఆ ఎంతమందిని చూశానో – ఈ నెలలో ముప్పైరెండో వాంగ్మూలం. ఇంత రాత్రి నిజాన్ని దోసిట్లో పట్టుకొందామని వస్తే ఇదీ ఫలితం. వంట వండుతుంటే కొంగు అంటుకొందని కొందరు, స్టౌ పేలి గాయాలైనాయని మరికొందరు అంతా స్టీరియోటైపు. ఆత్మహత్య చేసుకొంటే అదీ చెప్పరు. దానిక్కారణాలూ చెప్పరు.
ఇన్సిడెంట్ జరిగింది ఏడుగంటలకి. హాస్పిటల్‌కి తెచ్చింది ఎనిమిది గంటలకి. నా దగ్గరికి వచ్చింది పన్నెండు గంటలకి. ఈ నాలుగ్గంటల కాలంలో ఆమెకి నూరేళ్ల భవిష్యత్తుని చూపిస్తారు. వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచింపచేస్తారు. ఈ నాలుగుగంటల కాలంలో పోలీసుల రాకపోకలు – బంధువులు – సలహాలు – సంప్రదింపులు – బేరసారాలు – రిహార్సల్స్ – ట్యూటరింగదులు – కాల్చి చంపాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితుల్ని కల్పిస్తే చాలు.
నిరాసక్తంగా గేటు దాటి జీపు వద్దకి వచ్చాను. ఆమె భర్తా, హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు సిగరెట్టు తాగుతూ కబుర్లు చెప్పుకొంటున్నారు. నన్ను చూసి ఆమె భర్త దూరంగా వెళ్లిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ సిగరెట్టు కింద పడేసి జీప్ దగ్గరికొచ్చాడు. తల దిమ్మెక్కిపోయింది. చదరంగంలోని పావులా తోచింది న్యాయం.