*పిడుగుపాటుకు ఒకరి మృతి*
రేగొండ (జనం సాక్షి) : పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందాడు సంఘటన మంగళవారం రేగొండ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు, మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వంగా పెద్ద రవి (50) వ్యవసాయ పనుల నిమిత్తం తన పత్తి చెను వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో వర్షంతో కూడిన ఉరుములు మెరుపులతో పిడుగు పడటంతో అక్కడికడే మృతి చెందినట్లు తెలిపారు.కాగా మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిడుగు పడి రైతు మృతి చెందడం తో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.