పిల్లల అనారోగానికి అద్దం పట్టిన కాగ్‌

దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం,నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడిరచిన కాగ్‌ నివేదికను విశ్లేషిస్తున్నారు. డా.నళిని

ఇటీవల విడుదలైన 2012`13 కప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ( కాగ్‌ ) నివేదిక ప్రకారం మన పిల్లల స్థితి చాలా దయనియంగా ఉంటుందని అర్థమవుతుంది. ఈ నెల 22వ కాగ్‌ నివేదిక మన సమగ్ర శిశు అభివృద్ధి పథకం’ (ఐసిడిఎస్‌) లోపాల్ని ఎత్తి చూపింది.  మరోసారి పిల్లల పోషకాహార లోపం ఎ.ఎండ మీదికి వచ్చింది.
కాగ్‌ నివేదిక ప్రకారం, 2006`2007 లో ఐసిడిఎస్‌ లో ఇచ్చే అదనపు ఆహారం వల్ల లబ్ధిపొందిన వారు. 7.06 కోట్లు అయితే, 2011`12కి వారి సంఖ్య 9.72 కోట్లకి పెరిగింది. అలానే, ఇంకా స్కూళ్లో చేరని ప్రీ స్కూలు పిల్లలు  (ఆరెళ్లలోపు వారు) 2006`2007లో ఐసిడిఎస్‌ వల్ల 3.01 కోట్ల మంది లబ్ధిపొందితే, వారు 2011`12లో 2011`12లో 3.58 కోట్లకి పెరిగారు. కానీ వారికి అందించే సేవాలు సక్రమంగా లేవని కాగ్‌ నివేదిక నిర్థారించింది. దీనికి కారణాలు అన్వేషించే ముందు అసలు కాగ్‌ నివేదికలో ఏ ముందో చూద్దాం.
ఇప్పటి నివేదికలో నిర్థారణలకు రావాడానికిముందు పదమూడు  రాష్టాలలో 67 జిల్లాల్లో ఉన్న 2730 అంగన్‌వాడి సెంటర్లని పరిశోదించింది. అందులో మన రాష్ట్రం కూడా ఉంది. పోషకాహార లోపం గల పిల్లల సంఖ్యని పేర్కోంటూ, ఐసిడిఎస్‌ పథకం వైఫల్యాలను కూడా నివేదిక వెల్లడిరచింది.
ఈ పథకం లబ్ధిదారుల్లో పోషకాహార లోపం గల పిల్లల సంఖ్య పది రాష్ట్రాల్లో 42 శాతం మించి ఉంది. బీహర్‌ లో 82 శాతం మందికి ఆహర లోపం ఉంటే, వారిలో 26శాతానికి తీవ్రమైన సోషకాహార లోపం (సివియర్‌ ఎక్యూట్‌ మాల్‌ న్యూట్రిషన్‌ ` శామ్‌ ) ఉంది. ఒడిశా,ఢల్లీి, దమన్‌ దియుల్లో అది 50 శాతం, మన రాష్ట్రంలో 49 శాతం, హర్యానా , రాజస్థాన్‌లలో 43శాతం , ఉత్తరప్రదేశ్‌లో 41శాతం, జార్ఖండ్‌లో 40 శాతం మంది పిల్లలు పోషకాహార లోపానికా గురవుతున్నారు. తీవ్రమైన లోపం (శామ్‌) గుజరాత్‌లో 5శాతం , పశ్చిమ బెంగాల్లో 4 శాతం, కర్ణాటక , మహారాష్ట్రల్లో 3శాతం ఉంది. ఈశాన్య రాఫ్ట్రాల్లో ఈ లోపం తగ్గుతుందన్న  విషయం ఆశాజనకమైన విషయం.
ఏ దేశంలో నైనా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి కొన్ని సూచికలను ప్రమాణంగా తీసుకుంటాం. మన దేశం తాను నిర్దేశించుకున్న లక్ష్యాలకు బహుదూరంలో ఉందని కాగ్‌ నివేదికలో వెల్లడయింది. ఉదాహరణకి ఐదు సంవత్సరాల లోపు వయసు గల శిశు మరణాలసంఖ్య (ఐఎంఆర్‌) 2010లో వెయ్యి పుట్టుకలకు 48 మరణాలు గా ఉంది. (మన లక్ష్యం 30) రాలుగేళ్ల లోపు వయస్సు గల బాలల మరణాలు సంఖ్య (సిఎంఆర్‌) 2010లో వెయ్యి పుట్టుకలకి 63 మరణాలుగా ఉంది. (మనలక్ష్యం 31) మన పోరుగు దేశాలతో పోలిస్తే మనం ఎంత దిగజారుడుగా ఉనాకనయో అర్థమవుతుంది.
మన దేశంలో పోషకాహార లోప మహమ్మరి ఎన్నో రకాలుగా పిల్లల్ని దెబ్బతీస్తోంది. అందుకే దీన్ని  ‘నిశ్శబ్దంగా దాడిచేసే అత్యవసర పరిస్థితి’ (సైలెంట్‌ఎమెర్జెన్సీ) గా వర్ణిస్తారు. పై లెక్కలే దీనికి తార్కాణం చేతులు కాళ్లు, పుల్లల్లా వేలాడుతూ, పొట్ట ఉబ్బిన ‘మరాస్‌మస్‌’ పిల్లలు గాని, మరణాలకి కారణమయే ‘క్యాషియార్కర్‌’ సోకిన ఉబ్బిని పిల్లలు గాని ఈ మహమ్మారి కొసలు మాత్రమే అట్టడుగున ఎత్తు పెరగని బరువు వపెరగని పిల్లలులు, ఎండిపోతున్న పిల్లలు మరెంతో మంది ఉన్నారు. ఆ దాడది నిరంతరం నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఐదు మంది పిల్లల్లో మన దేశంలో ఒకరుంటారు. మన దేశంలో ప్రతి రెండో పిల్లకి పోషకాహార లోపం ఉంటుంది. నలుగురు పిల్లల్ని చూస్తే ముగ్గురికి రక్తహీనత ఉంటుంది. ప్రతి రెండో శిశువుకి ఆమొడిన్‌ లోపం వల్ల మొదడు ఎదుగుదల దెబ్బతిని ఎడ్డితనం సోకే అవకాశం ఉంది.
అంతేకాక తీవ్రమైన పోషకాహార లోపానికి గురవుతున్న పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా 5 శాతం ఉంటే మనదేశంలో 3 నుంచి 10 శాతం మంది ఉన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు పది మిలియన్లు చనిపోతే అందులో 50 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారు. ఈ మరణాలకు కారణం పౌష్టికాహార లోపంతో పాటు వచ్చే అంతటు వ్యాధులు, కృశించిపోయిన పిల్లల్లో అంటు సోకడం అతి తేలిక, వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. (విటమిన్లు, ఖనిజాలు వంటి మైక్రో న్యూట్రయంట్స్‌ లోపం వల్ల) ఎందుకంటే నిరోధక శక్తినిచ్చే రక్తకణాలు వారిలో వృద్ది చెందవు. అలా అంటు సోకడం వల్ల వారి పోషకాహార లోపం స్ధాయి మరింత పెరుగుతుంది. ఫలితంగా మరిన్ని రోగాలు సంప్రాప్తిస్తాయి. మనం వైద్యపరంగా, ఆహార విధానాల పరంగా ఎక్కడో అడ్డుకట్ట వేయకపోతే ఈ విషవలయం అలాగే కొనసాగి మరణాలకు దారితీస్తుంది.
ఈ పరిస్థితిని మెరుగుపరుచడం కోసం ప్రాధమిక సామాజిక సంక్షేమ పధకంగా ప్రభుత్వం 1975లో సమగ్ర అభివృద్ది పథకాన్ని(ఐసిడిఎస్‌) ఏర్పాటు చేసింది. ఈ సథకం లబ్దిదారులు యుక్త వయసు వరకు ప్రతి ఆడపిల్ల ఆరెళ్ల పిల్లలందరు, గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే బాలింతలు, ఆడపిల్లల్ని మగపిల్లల స్థాయికి పెంచే లక్ష్యం ఈ పధకంలో కీలకాంశం.
ఐసిడిఎస్‌ పథకం లక్ష్యాలు
` ఆరెళ్ల లోపు పిల్లల ఆరోగ్య స్దాయిని, పోషకాహర స్థాయిని పెంచడం
` మన దేశంలో పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్దికి బాటలు వేయడం
` శిశు మరణాలని తగ్గించి, పోషకాహార లేమిని పారదోలి, పాఠశాల విద్యని మధ్యలోనే విరమించుకునే ‘డ్రాప్‌ అవుట్స్‌’ సంఖ్యని తగ్గించడం
` చిన్న పిల్లలు తల్లులకు ఆరోగ్యం, ఆహారం విషయాలపై శిక్షణనిచ్చి పిల్లల పెంపకంలో వారి స్ధాయిని పెంచడం
అన్ని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న ఐసిడిఎస్‌ పథకం పరిధి టీకాలు, ఆదనపు ఆహారం, ఆరోగ్యం పరీక్షలు, అవసరమైతే పై సెంటర్లకి పంపే రిఫరల్‌ వ్యవస్థ, ఇంకా బడికి వెళ్లని ప్రీ స్కూల్‌ పిల్లలకి అనియత విద్యని అందించడం(ఇది ఈ పధకానికి వెన్నెముక అంటారు) ఆరోగ్యం, ఆహారం గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం. ఇలాంటి సేవల్లో భాగంగా ఈ పథకం కింద ప్రతి ఆరేళ్ల లోపు పిల్లలకి 300 కేలరీలు, 8`10 గ్రాముల మాంసకృత్తులు అందాలి. యుక్త వయసు పిల్లలకి గర్బిణీ స్త్రీలకి, బాలింతలకి 500 కేలరీలు, 25 గ్రాముల మాంసకృతులు అందాలి. పోషకాహార లోపం గలత పిల్లలకి 600 కేలరీలు, 16`20 గ్రాముల ప్రోటీన్లు అందాలి. ఇవన్నీ అదనపు ఆహారం (సప్లమెంటరీ న్యూట్రిషన్‌)గా అందుతాయి.
కాని నిజానికి ఏమి జరుగుతోంది? 1975లో ఐసిడిఎస్‌ ఏర్పాటు చేసే నాటికి సంవత్సరం లోపు శిశు మరణాల సంఖ్య వెయ్యికి 44. ఇప్పుడు 48, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య వెయ్యికి 93. ఇప్పుడు అది 61 (మన లక్ష్యం 38), అయితే 18 శాతం శిశు మరణాలు ఈ వయసులో సంభవిస్తున్నాయి. (చైనాలో ఐదేళ్ల లోపు మరణిస్తున్న వారు వెయ్యికి 15, బంగ్లాదేశ్‌లో 46, కెనడాలో 6, జపాన్‌లో 3, కువైట్‌లో 11, లెబనాన్‌లో 9, దక్షిణాఫ్రికాలో 47),మన ఐసిడిఎస్‌ ఆరంభించే నాటిక బరువు తక్కువ నవజాత శిశువులు 25 శాతం. ఇప్పుడ అది 28 శాతం. మరి ఈ పథకం ప్రయోజనాలు ఏమవుతున్నాయి? దాని పనితీరుపై కాగ్‌ నివేదిక ఒక అవగాహన కల్పిస్తుంది, చూడండి.
(ఇంకా వుంది)