పీడీపీ శాసనసభ పక్షనేతగా మెహబూబా

2

శ్రీనగర్‌ మార్చి 24 (జనంసాక్షి):

జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు పడింది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) తమ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈరోజు జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశానికి హాజరయ్యే ముందు ముఫ్తీ అక్కడి అనంతనాగ్‌ జిల్లాలో ఉన్న తన తండ్రి మహ్మద్‌ సయ్యద్‌ సమాధిని దర్శించుకున్నారు. పీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో ముఫ్తీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనమే. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ముఫ్తీ చర్చించిన సంగతి తెలిసిందే. పీడీపీకి మద్దతిచ్చేందుకు భాజపా సుముఖంగానే ఉంది.