పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

C
మండలి సీట్లు పెంచేందుకు నిర్ణయం

హామీలు అమలు కాలేదు:సోనియా

బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా లేదు:వెంకయ్య

ముంపు మండలాలను ముంచేశారు

తెలంగాణ కరెంటు వాటా ఎగబెట్టారు:వినోద్‌

న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనచట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మండలి సీట్ల పెంపు ప్రతిపాదనపై చట్టసవరణకు ఆమోదముద్ర వేసింది. దీనిపై చర్చ సందర్భంగా ఏఐసీసీ ఆధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ ఏపీకి రైల్వే జోన్‌ ఇస్తామని చట్టంలో చెప్పామని, అయితే సర్కారు బిల్లులో పేర్కొన్న హామీల అమలుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు. బిల్లు ఆమోదించి 9 నెలలైనా ఇప్పటికీ ఏపీకిచ్చిన హామీలు నెరవేర్చట్లేదన్నారు. సోనియా వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చట్టంలో లోపాలున్నాయని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చలో ఆయన మాట్లాడుతూ శాసనసభ్యుల సంఖ్యను బట్టి మండలి సభ్యుల సంఖ్యను కేటాయించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై 2004లో హావిూ ఇచ్చి 2014 వరకు ఎందుకు ఆగారని, వందల మంది ఆత్మత్యాగాలు చేసుకునేవరకు రాష్ట్ర విభజన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణకు ప్రత్యేక హావిూలు ఇవ్వాల్సిన అవసరం లేదని వీరప్పమొయిలీ వ్యాఖ్యానించారని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్రు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హావిూల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రెండు రాష్టాల్రూ పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. బిల్లులో చెప్పినవిధంగా ఐఐఎంకు శంకుస్థాపన జరిగిందని, ఎయిమ్స్‌కు గుంటూరులో స్థలపరిశీలన జరిగిందని వెంకయ్యనాయుడు చెప్పారు. రెవెన్యూ లోటులో ప్రతి రూపాయి కేంద్రమే భర్తీ చేస్తుందని సభలో ఆర్థికమంత్రి చెప్పారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ¬దా అన్న విషయాన్ని పునర్విభజన బిల్లులో పొందుపర్చలేదని కేంద్ర మంత్రి అన్నారు. లోక్‌సభలో సవరణ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ  ప్రత్యేక ¬దా విషయంలో రాజ్యసభలో అప్పటి ప్రధానే ప్రకటన చేశారని, తాను కూడా మాట్లాడానని, లోక్‌సభలో బిల్లుపై చర్చ సమయంలో ప్రత్యేక ¬దా ప్రస్తావనే రాలేదని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక ¬దా సోనియా బహుమతి అని ప్రకటించుకున్నారని, ప్రత్యేక తెలంగాణ సోనియా ఇచ్చిన వరమని చెప్పుకొన్నారని ఆయన విమర్శించారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభ మంగళవారం మధ్యాహ్నం చర్చ చేపట్టింది. ఈ విషయంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ ఏపీకి రైల్వే జోన్‌ ఇస్తామని బిల్లులో చెప్పామని, హావిూలు ఇచ్చి 9 నెలలైందని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ప్రధానికి సైతం రెండు సార్లు నివేదించానన్నారు. ప్రధాని తక్షణం ఆంధప్రదేశ్‌ హావిూలపై దృష్టిసారించాలన్నారు. తాము బిల్లులో పొందుపర్చిన అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు. అయితే రెండు రాష్టాల్రు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయిన వెంకయ్యనాయుడు  తెలంగాణ ఏర్పాటుపై 2004లో హావిూనిచ్చిన సోనియా గాంధీ 2014 వరకు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. 9ఏళ్ల 9నెలల సమయంలోనైనా సోనియా స్పందించడం హర్షణీయమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. వందలమంది ఆత్మత్యాగాలు చేసుకునే వరకు రాష్టాన్న్రి ఎందుకు విభజించలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణకు, ఆంధ్రకు ప్రత్యేక హావిూలివ్వక్కర్లేదని వీరప్ప మొయిలీ చెప్పారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హావిూల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక ¬దా అనేది బిల్లులో పేర్కొనలేదని.. ఈ విషయంలో రాజ్యసభలో అప్పటి ప్రధాని ప్రకటన చేశారని తెలిపారు. ప్రత్యేక ¬దా విషయంలో బిల్లుపై చర్చ సమయంలో లోక్‌సభలో ప్రస్తావించలేదని తెలిపారు. అయితే వీటన్నిటినీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

కరెంటు వాటా ఎగబెట్టారు:వినోద్‌

విభజన చట్టం వల్ల ఇరు తెలుగు రాష్టాల్రకు ఏర్పడిన సమస్యలను ఒకే చట్టంతో  పరిష్కరించకుండా కేవలం ఎపిలో మండలి సీట్లను పెంచేందుకు మాత్రమే చట్ట సవరణ చేయడాన్ని లోక్‌సభలో టిఆర్‌ఎస్‌ తప్పుపట్టింది. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని పదేపదే తాము విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని లోక్‌సభలో టిఆర్‌ఎస్‌ నాయకుడు వినోద్‌ అన్నారు. ఎపిలో మండలి సీట్లు పెంచడానికి తాము వ్యతిరేకం కాదంటూనే సమస్యలు అన్నీ పరిస్కరించేలా చట్ట సవరణ చేయాలన్నారు. హైకోర్టు, ముంపు మండలాలు, కృష్ణా జలాలు, విద్యుత్‌ సమస్య వంటివి ఇందులో ప్రధానమైనవని అన్నారు.   హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ గుర్తు చేశారు. లోక్‌సభలో వినోద్‌ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపర్చారని తెలిపారు. తక్షణమే ఏపీ ప్రత్యేక హైకోర్టు చేయాలని కోరారు. హైకోర్టును విడదీయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక హై కోర్టు ఏర్పరచాలని బిల్లులో పేర్కొన్నా ఎందుకు చేయలేదని అన్నారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా తెలంగాణలోని ఏడు మండలాలను ఎపిలో విలీనం చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఎంతో నేపద్యం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక ఇంతలోనే ఏడు మండలాలను ఎపిలో విలీనం చేశారని, ఆ మండలాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎపి శాసనమండలిలో సీట్లు 58 సీట్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే శానసభ లో స్థానాలు పెంచడానికి విభజన చట్టంలో పేర్కొన్నారని, కాని ఎన్‌డీఎ ప్రభుత్వం ఎందుకు ఆపని చేయడం లేదని అన్నారు. ఆర్టికిల్‌ 170 లో నిషేధం ఉంది కనుక సవరించడం లేదని చెబుతున్నారని, కాని దానిని సవరించి అసెంబ్లీ సీట్లను పెంచవచ్చని వినోద్‌ అన్నారు. రాజకీయంగా శాసనమండలి సీట్లను పెంచుతున్నారు తప్ప , ఇతర చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు బావిస్తారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లోనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలలాను బీజేపీ ఆర్డినెన్స్‌ ద్వారా విడదీసిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ తెలిపారు. ఏడు మండలాలను విడదీసి ఆంధ్రాలో కలిపినప్పటికీ ఆ మండలాలను ఏపీ ఆదుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆ ఏడు మండలాలను తెలంగాణనే ఆదుకుంటోందని గుర్తు చేశారు. ఏడు మండలాలకు తెలంగాణనే విద్యుత్‌ సరఫరా చేస్తుందన్నారు. ఆ మండలాల కనీస అవసరాలను కూడా తెలంగాణనే చూసుకుంటుందన్నారు.

ఏడు మండలాలను అశాస్త్రీయంగా ఆంధ్రాలో కలిపారని తెలిపారు. విభజన తర్వాత వచ్చిన సమస్యల పరిష్కారానికి ఉమ్మడి చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఇరు రాష్టాల్రకు సమన్యాయం చేయాలని పదేపదే ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికి ఖమ్మం జిల్లాలోని వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు రోడ్డు సౌకర్యం లేదన్నారు. ఈ మండలాల్లో గిరిజనుల బతుకు దయనీయంగా మారిందన్నారు. హైకోర్టు విభజనపై  న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ జోక్యం చేసుకుని  సమాధానం చెబుతూ సరైన సదుపాయాలు ఇస్తే హైకోర్టు ఏర్పాటు చేస్తామని లాయర్లకు హావిూ ఇచ్చామని అన్నారు. ఇందుకు లాయర్లు ఒప్పుకున్నారని అన్నారు.సి.ఎమ్‌. నుంచి వివరంగా లేఖ తీసుకు రావాలని కోరామని అన్నారు.

విద్యుత్‌ను అడ్డుకుంటున్న ఎపి

తెలంగాణ రాష్టాన్రికి రావాల్సిన విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌ అడ్డుకుంటోందని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తాసుఖేందర్‌ రెడ్డి తెలిపారు.  లోక్‌సభ లో  ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ను ఇచ్చిపుచ్చుకునే విషయంలో తీవ్ర సమస్యలు వస్తున్నాయని తెలిపారు. నీటికోసం యుద్ధాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. ఇప్పటికే ఇరు రాష్టాల్ర పోలీసులు ఘర్షణకు దిగారని అన్నారు.  కృష్ణాబోర్డుకు విధి,సమగ్ర అధికారాలను ఇవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. తెలంగాణకు 153,ఏపీకి 225 మంది సభ్యుల సంఖ్యను పెంచేందుకు చట్టం తేవాలని కోరారు.