పునర్ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు అన్యాయం
లోక్‌సభలో గళం విప్పిన వినోద్
న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ చట్ట సవరణ బిల్లును సోమవారం కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రెండు రాష్టాల్ల్రో ఎమ్మెల్సీ స్థానాల పెంపునకు సంబంధించిన చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలను పెంచే ప్రతిపాదనను బిల్లు రూపంలో తీసుకొచ్చారు. ఎపి పునర్విభజన చట్టానికి సవరణ చేస్తూ ఈ బిల్లు పెట్టారు.దీని ప్రకారం ఎపిలో శాసనమండలి స్థానాలు పెరుగుతాయి. అలాగే తెలంగాణలో కూడా పెరిగే అవకాశం ఉంది. ఎపిలో ఎమ్మెల్సీ స్థానాలు దీనితో ఏభై ఎనిమిది కి చేరతాయి.అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్.పి వినోద్ అభ్యంతరం చెప్పారు. ముందుగా రెండు రాష్టాల్ర అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దీనినిపెట్టాలని, సమగ్రంగా బిల్లు తేవాలని సూచించారు. అనేకానేక సమస్యలు ఇందులో ముడిపడి ఉన్నాయని అన్నారు. వాటిని ప్రస్తావించకుండా కేవలం ఎమ్మెల్సీల కోసం దీనిని ప్రవేశ పెట్టడం సరికాదన్నారు. విభజన సమస్యల పరిష్కారంలో ఇదొక ముందడుగు మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎమ్మెల్సీల స్థానాలు పెంచడం తమకు అభ్యంతరం కాదని, అయితే ఇతరత్రా సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. ముంపు మండలాలకు నేటికీ తెలంగాణ నుంచే విద్యుత్ సరషఫరా జరుగుతోందని ఎంపి వినోద్ అన్నారు. విద్యుత్,నీటి సమస్యలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి రెండు రాష్టాల్రతో చర్చించాల్సి ఉందన్నారు. అలాకాకుండా కేవలం ఏకపక్షంగా బిల్లు పెట్టడం సరికాదన్నారు. దీనిని అసెంబ్లీలకు పంపి చర్చించాల్సి ఉందన్నారు. ఇలా చర్చిస్తామని కూడా కేంద్రమంత్రి హావిూఇచ్చిన విషయాన్ని ఎంపి గుర్తు చేశారు. .మిగిలిన అన్ని సమస్యలను పక్కన బెట్టి కేంద్రం కూడా పదవుల సంఖ్య పెంచడంలో మాత్రం ఆసక్తి కనబరుస్తోందన్నారు.