పెద్దల సభలో అగస్తా దుమారం
సోనియా పేరు ప్రస్తావించడంపై మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ,ఏప్రిల్27(జనంసాక్షి):
ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ కుంభకోణంపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలతో సభలో గందర గోళం నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు సభకు తీవ్ర అంతరాయం కలి గించారు. రాజ్యసభలో వీవీఐపీ చాపర్ కుంభకోణం గురించి మాట్లాడుతూ భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈ కుంభకోణంతో సంబంధం ఉందని అనడంతో సభలో గందరగోళం నెలకొంది.యూపీఏ హయాంలో వీవీఐపీల కోసం ఇటలీకి చెందిన ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరపాలని భాజపా కోరింది. మిగతా 2లోతాము కూడా భయపడమని చర్చ జరిపించమని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. సోనియా గాంధీ కూడా భయపడేది లేదంటూ సభలో సమాధానమిచ్చారు. దాచడానికేవిూ లేదు, కుంభకోణంలో నా పేరు ప్రస్తావిస్తే నేనేవిూ భయపడను, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం… అని సోనియాగాంధీ పేర్కొన్నారు. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే ప్రాసెస్‌ను భాజపా ప్రభుత్వం రద్దు చేసింది. అది మోసపూరిత కంపెనీ. కంపెనీని ఎందుకు రక్షిస్తున్నారో మోదీ సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ చాపర్ కుంభకోణంలో భారత్‌తో డీల్ కోసం లంచం ఇచ్చిన అధికారులకు ఇటలీ కోర్టు శిక్ష విధించింది. అయితే లంచం తీసుకున్నదెవరో తేలాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అగస్టా కుంభకోణం వ్యవహారంలో తాను భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె స్పందించారు. విూడియాతో మాట్లాడుతూ అగస్టా ఒప్పందంలో తమ దగ్గర దాచే విషయం ఏదీలేదన్నారు. ఆ కుంభకోణంలో బీజేపీ తన పేరును వాడుకున్నా, తనకు భయం లేదన్నారు. రెండేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇప్పటి వరకు ఆ వ్యవహారంలో విచారణను ఎందుకు ముగించలేదని ఆమె ప్రశ్నించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారామె. విచారణ ముగిస్తే, వాస్తవం బయటకు వస్తుందని సోనియా తెలిపారు. అగస్టా వ్యవహారంలో సోనియా గాంధీ కుటుంబీకుల పాత్ర ఉన్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఆరోపించారు. వాస్తవం వెలుగు చూడాలని ఆయన అన్నారు. సోనియా గాంధీతో పాటు అహ్మద్ పటేల్ పేర్లు అగస్టా వ్యవహారంలో ఉన్నట్లు పారికర్ ఆరోపించారు. అగస్టా కుంభకోణం అంశంలో అనేక మంది వీఐపీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన కుంభకోణం వ్యవహారం సోనియా పేరు వినిపించిందని, దానిపై విచారణ చేపట్టాలని తృణామూల్ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ డిమాండ్ చేశారు. రాజ్యసభ్యలో ఇవాళ అగస్టా వెస్ట్‌ల్యాండ్ దుమారం చెలరేగింది. ఆ కుంభకోణంపై ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఆరోపణలు చేశారు. దాంతో కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకొచ్చారు. సోనియా సభలో లేదు, అగస్టా కుంభకోణంలో ఆమె పేరును ఊటంకించరాదని డిప్యూటీ చైర్మెన్ పీజీ కురియన్ రాజ్యసభలో సూచించారు. ఈ గొడవ మధ్యలోనే సభను వాయిదా వేశారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్. ఇదో వీవీఐపీ హెలికాప్టర్. ఆ హెలికాప్టర్లను ఇటలీ సంస్థ నిర్మిస్తుంది. ఆ హెలికాప్టర్ల కోసం 2010లో కాంగ్రెస్ పార్టీ సుమారు రూ.3600 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రస్తుత బీజేపీ ఆరోపిస్తోంది. ఇవాళ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభలో ఇదే అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. మంగళవారమే రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన సుబ్రమణియన్ స్వామి కూడా ఈ అంశంపై చర్చించాలని నోటీసు ఇచ్చారు.