పేటా నూతన అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి
హుస్నాబాద్ జూన్ 16 (జనంసాక్షి) :
పేటా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పూల గోపాల్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి వెంకటర్సయ్య ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం డివిజన్ స్థాయి సమావేశం ప్రభుత్వ బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా పేటా సంఘం డివిజన్ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్ను కున్నారు. ఉపాధ్యక్షునిగా జే. వెంకటరామారావు, సంయుక్త కార్యదర్శిగా రాజ్‌కుమార్, మహిళా ప్రతినిదిగా సఫియాలను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల పేటా జిల్లా అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరుగగా ఎన్నికల అధికారిగా పేటా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.సారయ్య వ్యవహరించారు.